Breaking News

స్పెషల్ క్యాంపెయిన్ డేస్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు గుంటూరు నగరంలో శనివారం, ఆదివారం “స్పెషల్ క్యాంపెయిన్ డేస్“జరుగుతాయని నగర కమిషనర్ శ్రీమతి కీర్తి చేకూరి ఐఏయస్ గారు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ గారు మాట్లాడుతూ నగరంలో స్పెషల్ సమ్మరీ రివిజన్ 2022 స్పెషల్ క్యాంపెయిన్ డేస్ లో భాగంగా నగరంలోని తూర్పు 250, పశ్చిమ 282 పోలింగ్ కేంద్రాల్లో ఈనెల 19, 20 తేదీల్లో బి.యల్.ఓ.లు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉంటారన్నారు. గతంలో కేవలం అక్టోబర్ 1 నాటికి 17 ఏళ్ళు నిండిన వారికీ మాత్రమే నూతన ఓటు దరఖాస్తుకు అవకాశం ఉండేదని, ప్రస్తుతం ఎన్నికల సంఘం జనవరి 1, ఏప్రిల్ 1, జూలై 1, అక్టోబర్ 1 నాటికి 17 ఏళ్ళు నిండిన వారికి నూతన ఓటు దరఖాస్తులు చేసుకోవడానికి వీలు కల్పిచిందన్నారు. పోలింగ్ కేంద్రాల్లో బి.ఎల్.ఓ.లు ఓటు మార్పులు, చేర్పులు, తొలగింపులు, చిరునామా మార్పుల పై దరఖాస్తులు తీసుకుంటారని తెలిపారు. కనుక ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, యువత ప్రతి ఒక్కరూ తమ ఓటుని నమోదు చేయించుకోవాలని కోరారు. గుంటూరు నగరంలో డ్రాఫ్ట్ ముసాయిదాలో పశ్చిమ (94)లో 2,59,643, తూర్పు (95)లో 2,31,147 అని మొత్తం ఓటర్లు 4,90, 790 అని అన్నారు. అందులో పశ్చిమలో 1,26,951 మంది పురుషులు, 1,32, 640 మంది స్త్రీలు, ఇతరులు 52 మంది అని, తొలగించిన ఓట్లు 14,700, తూర్పులో 1,12,510 మంది పురుషులు, 1,18,593 మంది స్త్రీలు, ఇతరులు 44 మంది, తొలగించిన ఓట్లు 10,081 అని తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్

-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *