-జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విద్యార్థి దశ నుండి యువత కొత్త ఆవిష్కరణలకు విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని దీనికి గ్రంధాలయాలు విజ్ఞాన బాండాగారాలుగా వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు పేర్కొన్నారు. ఈనెల 14వ తేది నుండి 20వ తేది వరకు నిర్వహిస్తున్న 55వ గ్రంధాలయ వారోత్సవాలలో భాగంగా వివిధ పాఠశాలలో విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన, వకృత్వ, క్వీజ్, పోటిలలో విజేతలకు స్థానిక బందర్‌రోడ్డులోని రామమోహన్ గ్రంధాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన బహుమతుల ప్రాధానోత్సవం కార్యక్రమంలో ముఖ్య అతిధిగా జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు పాల్గొన్నారు.
ఈసందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆధునిక కాలంలో ఇంటర్నెట్, ఇ`బుక్ వంటి సౌకర్యాలు అందుబాటులో ఉన్నప్పటికి గ్రంధాలయాలలో పుస్తక పఠనానికి ఎంతో ప్రాధాన్యత ఉంటుందన్నారు. విద్యార్థులు పాఠ్యాంశాలతో పాటు సమాజంలో జరుగుతున్న ప్రస్తుత సమాచారాన్ని కూడా నిరంతరం తెలుసుకోవాలన్నారు. నాలుగు రకాల భాషాలు రావాలంటే లిసైనింగ్, స్పీకింగ్, రీడిరగ్, రైటింగ్ (ఎల్ ఎస్ ఆర్ డబ్ల్యు) వినడం, మాట్లడటం, చదువడం, వ్రాయడం వంటి అంశాలతోనే సాధ్యపడుతుందన్నారు. రామోహన్ గ్రంధాలయం 1914లో రాష్ట్రంలో మొట్టామొదటి ప్రజా గ్రంధాలయంగా ఏర్పాడి అయ్యింకి వెంకటరమణ, సూరిశాస్త్రీలు, అసోసియేషన్ ఏర్పాటు చేయడం ద్వారా అభివృద్ధి చెందిందన్నారు. విద్యార్థులు విద్యతో పాటు యోగా వలన ధ్యానం, వ్యాయమం, ప్రాణమాయం అలవాటు చేసుకుని చెక్కుచెదరని స్పూర్తితో మెలగాలన్నారు. యువత పుస్తక పఠనం ద్వారా విషయాన్ని భట్టిపట్టకుండా గుర్తు పెట్టుకునే విధంగా అవగాహన చేసుకోవాలన్నారు. రామోహన్రాయి ఆనాటి సమాజంలో క్రతువు, త్యాగాలు ఎక్కువగా వుండడంతో బ్రహ్మ సమాజాన్ని ఏర్పాటు చేసి పూజ కంటే ప్రార్థన ముఖ్యమని ప్రజలలో ప్రచారం చేశారని కలెక్టర్ డిల్లీరావు తెలియజేశారు.
ఆంధ్రప్రదేశ్ గ్రంధాలయ కార్యదర్శి ఆర్. శారద మాట్లాడుతూ సమాజంలో గ్రంధాలయాల ప్రాధాన్యతను ప్రచారం చేయడానికి గ్రంధాలయ వారోత్సవాలు జరుపుతారన్నారు. ప్రతి విద్యార్థికి గాలి పీల్చడం ఎంత అవసరమో చదువుకోవడం అంత ముఖ్యమన్నారు. ఎవరు బాగా చదువుతారో వారే విజేతలవుతారని విద్యార్థులకు స్పూర్తిదాయకమైన ఉపన్యాసం అందించారు.
గ్రంధాలయ కమిటీ కార్యదర్శి వి. కెశవరరావు మాట్లాడుతూ యువత ఉద్యోగ అవకాశాల కొరకు చూపిస్తున్న శ్రద్దకు అనుగుణంగా ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని గత సంవత్సరంలో ప్రత్యేక పుస్తక ప్రదర్శన ఏర్పాటు చేయడం, మరొక సంవత్సరం చిత్ర కళాకారుల చిత్రాలు ప్రదర్శనలు చేయడం జరిగిందన్నారు. ఈ సంవత్సరం విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీసే పోటీలు నిర్వహించడం జరిగిందన్నారు.
తొలుత గ్రంధాలయ కమిటీ అధ్యక్షులు సిహెచ్ కోటేశ్వరరావు అతిధులకు స్వాగతం పలికారు. కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ జ్వోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. విజేతలకు జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు విద్యార్థులకు ప్రధమ, ద్వితియ, తృతియ విభాగాలలోని బహుమతులు అందజేశారు.
కార్యక్రమంలో గ్రంధాలయ కమిటీ ఉపాధ్యక్షులు డి. రామచంద్రరావు, కె. శ్రీకృష్ణ భాగవన్, కమీటి సభ్యులు పి చిదంబేశ్వరావు, సిహెచ్ పద్మ, మాధవరావు, కిరణ్, సాంబశివరావు, గ్రంధాలయ సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News