విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రభుత్వ ప్రాధాన్యత భవన నిర్మాణాలలో అధికారులు పురోగతి చూపి జిల్లాను రాష్ట్రంలోనే ప్రధమంగా నిలపాలని జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ప్రాధాన్యత భవన నిర్మాణ పనుల ప్రగతిపై యంపిడివోలు, పంచాయతీ రాజ్, ఇంజనీంగ్‌్ అధికారులతో శుక్రవారం జిల్లా కలెక్టర్ డిల్లీరావు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ డిల్లీరావు మాట్లాడుతూ జిల్లాలో 107 కోట్ల నిధులతో 268 గ్రామ సచివాలయాలు, 56 కోట్ల 68 లక్షల నిధులతో 260 రైతు భరోసా కేంద్రాలు, 41 కోట్ల 82 లక్షల నిధులతో 239 వైఎస్సార్ హెల్త్ క్లినిక్‌లు, 25 కోట్ల 97 లక్షల నిధులతో 147 బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్ నిర్మాణాలు చేపట్టడం జరిగిందన్నారు. మొత్తంగా 914 భవన నిర్మాణాలకు 228కి పైగా నిర్మాణాలు పూర్తి చేయడం జరిగిందన్నారు. మిగిలినవి వివిధ దశలలో ఉన్నాయని వీటిలో ఫినిషింగ్ స్టేజ్‌లో ఉన్న 117 భవనాలను రెండు రోజులలో పూర్తి చేయాలన్నారు. జిల్లాలో ఎక్కడ ఇంకనూ ప్రారంభం కాని భవన నిర్మాణాలు ఉండరాదన్నారు. తక్షణమే వాటిని ప్రారంభించి అప్‌లోడ్ చేయాలన్నారు. భవన నిర్మాణాలలో మన జిల్లా రాష్ట్ర ప్రగతిలో ఆశించిన స్థాయిలో లేకపోవడం అధికారులు దృష్టిలో పెట్టుకుని నాలుగు రోజులలో కనీసం టాప్ 5 జిల్లాగా తీసుకురావాలన్నారు. యంపిడివోలు, పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధుల సమన్వయంతో పనులను వేగవంతం చేయాలన్నారు. బెస్మింట్ స్థాయిలో ఉన్న వాటిని రూప్ స్థాయికి, రూప్ స్థాయిలో ఉన్న వాటిని ఫినిషింగ్ స్థాయికి తీసుకురావాలన్నారు. ఎప్పటికప్పుడు పనుల ప్రగతిని అప్‌లోడ్ చేయాలన్నారు. నిర్మాణాలకు అవసరమైన ఐరన్, సిమెంట్, ఇసుక, మెటల్ వంటి మెటీరియల్‌ను అందుబాటులో ఉంచామన్నారు.ప్రస్తుతం వాతావరణం కూడా అనుకూలంగా వుందని అధికారులు నిర్మాణ పనులలో నిమగ్నమై ప్రగతి చూపాలన్నారు. క్షేత్రస్థాయిలో ఎదురయ్యే ఇబ్బందులను ఎప్పటికప్పుడు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. నిర్మాణాలలో తక్కువ ప్రగతి చూపుతున్న సంబంధిత మండల యంపిడివోలు, ఇంజనీరింగ్ అధికారులను టెలీకాన్ఫరెన్స్ ద్వారా జాప్యానికి తగిన కారణాలను తెలుసుకుని పరిష్కారం చూపారు.
టెలీకాన్పరెన్స్‌లో పంచాయతీరాజ్ ఎస్‌ఇ ఎ. వెంకటేశ్వరరావు, యంపిడివోలు, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులు ఉన్నారు.
Prajavartha Online Telugu News