Breaking News

ఆయుష్ మంత్రిత్వ శాఖ 3500 కోట్ల రూపాయల తో పేద ప్రజలకు విశేష సేవలు అంది స్తోంది…

-ఎంపి, మార్గాని భరత్ రామ్
-రాజ్ భవన్ నుంచి ఏపీ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ ప్రసంగం వర్చువల్ విధానంలో ప్రసారం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆయుష్ మంత్రిత్వ శాఖ రూ. 3,500 కోట్ల తో పేద ప్రజల కు విశేష సేవలు అందిస్తోందని ఎంపి, మార్గాని భరత్ రామ్ అన్నారు. స్థానిక ఆనం కళా కేం ద్రంలో ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మూడు రోజులు పాటు జరగనున్న జాతీయ ఆ యుర్వేద పర్వ్ కార్య క్రమాన్ని శుక్రవారం జ్యోతి ప్రజ్వలన చేసి ఎంపీ మార్గాని భరత్ రామ్ ప్రారంభించారు.

ఈ సందర్బంగా భరత్ రామ్ మాట్లాడుతూ అధ్యయనం, పరిశోధన, ప్రాచీన వైద్యాన్ని భావితరాలకు అందించడం కోసం ప్రధానంగా ఆయుష్ శాఖ పని చేస్తోందని అన్నారు. అధ్యాయానికి, పరిశోధనకు, ప్రధానం గా రోగ నివారణ మార్గాలు కోసం ఆయూష్ శాఖ పని చేస్తోందని అన్నారు. ప్రతీ రీజియన్లో వైద్యం, పరిశోధన ఒకే గొడుగు కింద ఆయుష్ విభాగం అందిస్తోందన్నారు. కరోనా మహామ్మారీ ని నివారించేందుకు రోగ నిరోధకశక్తి పెంచడం కోసం ప్రత్యేక దృష్టి కేంద్రీకరించిందన్నారు. దేశ వ్యాప్తంగా మన ప్రాచీన వైద్యాన్ని ప్రపంచానికి అందిస్తోందన్నారు.
మూడు రోజుల పాటు జరిగే ఈ జాతీయ ఆయుర్వేద పర్వ్ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

ఈ సందర్భంగా జాతీయ ఆయుర్వేద పర్వ్ సావనీర్ ను భరత్ రామ్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఆయుర్వేద పర్వ్ లో ఆయుర్వేద, నేచురోపతి, హోమియోపతి, సిద్ధ, యునాని వైద్యం అందించడమే కాకుండా ఉచిత మందుల పంపిణీ చేయడం జరుగుతున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంలో ఆయూర్వేద, తదితర సంప్రదాయ వైద్య పరంగా సేవలు అందిస్తున్న పలువురిని సత్కరించడం జరిగింది.

ఈ కార్యక్రమం లో జాతీయ కన్వీనర్, ఆయుర్వేదిక్ పర్వ్  మనోజ్ జిన్నా, స్టేట్ కన్వీనర్ బాలు అక్కిస, డాక్టర్లు రమణా చార్యులు, మురళీకృష్ణ రూరి, అహమ్మద్, హార్జల్ అంజలిన, అల్లూరి రామలింగయ్య హో మియో కాలేజీ, ఆర్ట్స్ కాలేజీ, ఉమెన్స్ కాలేజీ విద్యార్థులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్

-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *