-ఆసుపత్రిలో వైద్య సేవలకు 58 బెడ్స్ అందుబాటులో ఐ సి యూ, ఫిజియథెరపీ, సైకాలజీ, జనరల్, డెంటిస్ట్, ఫార్మసీ, మెడికల్ స్టోరీ, ఆపరేషన్ థియేటర్, ల్యాబెరేటరీ సేవలు
-హోం మంత్రి తానేటి వనిత
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
సెంట్రల్ జైలు పరిధిలో ఉన్న ఖైదీలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించే సామర్థ్యం పెంచడం జరిగిందని రాష్ట్ర హోం మంత్రి డా తానేటి వనిత అన్నారు. శుక్రవారం రూ.4.50 కోట్లతో నిర్మించిన ఆసుపత్రి భవనాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ మార్గని భరత్ రామ్, జెడ్పీ చైర్మన్ వి. వేణుగోపాల్, జిల్లా కలెక్టర్ డా . కె. మాధవీలత , డిజి (ప్రిజన్స్) మొహమ్మద్ అసన్ రీజా, డి ఐ జి .. ఎమ్ ఆర్ రవి కిరణ్, ఐ జీ – ఐ శ్రీనివాస రావు, సూపరింటెండెంట్ (సెంట్రల్ జైల్) ఎస్. రాజారావు, డిప్యూటీ సివిల్ సర్జెన్ డా పి. కోమలి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హోం మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ, ముఖ్యమంత్రి ఖైదీలకు మెరుగైన వైద్య సేవలు అందించే క్రమంలో ఆరోగ్యశ్రీ పరిధిలోకి వారిని కూడా తీసుకుని వొచ్చే ఒక మంచి నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. సెంట్రల్ జైల్ లో నూతనంగా ఏర్పాటు చేసిన ఆసుపత్రిలో సర్జెన్, డెంటల్, మానసిక, ఫిజియథెరపీ వైద్య సేవలు అందించనున్నట్లు తెలిపారు. చిన్న చిన్న అపెరేషన్స్ కూడా ఇక్కడ చేసేందుకు అవసరమైన వసతులు కల్పిస్తున్నట్లు ఆమె తెలిపారు. ఇక్కడ ఖైదీ చేయబడిన ఖైదీల్లో ఉన్న నైపుణ్యాన్ని గుర్తించి ప్రోత్సాహం ఇస్తున్నట్లు చెప్పారు. యోగా తదితర అంశాలపై కూడా తర్ఫీదు ఇవ్వడం ఇక్కడ ప్రత్యేకత అన్నారు. ఫర్నిచర్, వస్త్రాలు, ఆహార పదార్థాలను, కూరగాయలను ఎంతో నాణ్యత కలిగిఉంటాయని, వివిధ ప్రభుత్వ కార్యాలయాలకు, స్కూల్స్, సంస్థలకు ఇండెంట్ పై సరఫరా చేస్తూన్నట్లు తెలిపారు. ఖైదీలకు మానసిక స్థైర్యం, పరివర్తన కల్పించి, ఆలోచనా విధానం మార్చే దిశలో నైపుణ్యం పెంచి వారికి జీవనోపాధి కల్పించడం ద్వారా విడుదల తరువాత భరోసా ఇచ్చే ప్రక్రియ చేస్తున్నట్లు తెలిపారు.
ఎంతో చారిత్రాత్మమైన చరిత్ర ఉన్న సెంట్రల్ జైల్ లో అంతర్భాగంగా ఆసుపత్రి నిర్మాణం చెయ్యడం జరిగిందని పార్లమెంట్ సభ్యులు మార్గని భరత్ రామ్ అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్రంలో వైద్య, విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వటం జరుగుతోందన్నారు. సెంట్రల్ జైల్ లోని ఖైదీలకు వైద్య సేవలు అందించే సమయంలో కొంత ఇబ్బందులు పడుతున్నా దృష్ట్యా వాటిని ఎదుర్కొనే దిశగా జైల్ లోనే ఆసుపత్రి నిర్మాణం పనులు పూర్తి చెయ్యడం జరిగిందన్నారు. అందుకు అనుగుణంగా వైద్యులు, సిబ్బంది, మందులు కూడా అందుబాటులో ఉంచామన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి తరహాలో నిర్మాణం చేపట్టడం జరిగిందన్నారు.
ఆసుపత్రి ప్రారంభించిన అనంతరం జైల్ ఖైదీలతో తయారుచేసిన ఫర్నీచర్, ఆహార పదార్థాల స్టాల్ లను సందర్శించారు. ఎంతో నాణ్యత కలిగి, పౌష్ఠిక విలువలతో తయారు చేసిన ఆహార పదార్థాలు సెంట్రల్ జైల్ ఎదురుగా ఉన్న పెట్రోల్ బంకు లో ప్రజలకు అందుబాటులో ఉంచామని జైల్ సూపరింటెండెంట్ ఎస్. రాజారావు తెలిపారు. వీటి ధరలు మార్కెట్స్ ధరల కంటే 60 శాతం తక్కువకు లభిస్తాయని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ విప్పర్తి వేణుగోపాల్, డిజి (ప్రిజన్స్) మొహమ్మద్ అసన్ రీజా, డి ఐ జి .. ఎమ్ ఆర్ రవి కిరణ్, ఐ జీ – ఐ శ్రీనివాస రావు, సూపరింటెండెంట్ (సెంట్రల్ జైల్) ఎస్. రాజారావు, ఇంఛార్జి ఎస్పీ సిహెచ్. సుధీర్ కుమార్ రెడ్డి, డిఎస్పీ ఎమ్. రాజ్ కుమార్, మహిళా జైల్ డిఎస్పీ కె. వసంత కుమారి, డిప్యూటీ సివిల్ సర్జెన్ డా పి. కోమలి, పలువురు పోలీసు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News