రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
“వికాస” ఆధ్వర్యంలో ఈ నెల 19వ తేదీ శనివారం “వికాస” కార్యాలయం, కలెక్టరేట్( బొమ్మూరు హార్లిక్స్ ఫ్యాక్టరీ ఎదురుగా) రాజమహేంద్రవరం”లో “జాబ్ మేళా” నిర్వహిస్తున్నారు. ఈ జాబ్ మేళాలో స్టార్ హెల్త్ లైఫ్ ఇన్సూరెన్స్,ఎ.డి.ఎం (ఎజన్సీ డెవలప్మెంట్ మేనేజర్), సేల్స్ మేనేజర్, ఎం.సి.వి బజాజ్ సంస్థలో బ్రాంచ్ మేనేజర్, సేల్స్ కో-ఆర్డినేటర్స్, ఏరియా మేనేజర్, అకౌంటెంట్ & రిసెప్షనిస్ట్, కోజంట్ ఇ సర్వీసెస్ సంస్థలో బిపిఒ, డెక్కన్ కెమికల్స్ సంస్థలో ట్రైనీ(ప్రొడక్షన్), ఇసుజు మోటార్స్ లిమిటెడ్, కె.ఐ. ఎం. ఎల్ & హోండాయ్ మోబీస్ సంస్థలో టెక్నిషియన్ ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. పై ఉద్యోగాలకు ఇంటర్, డిగ్రీ, ఐ.టి.ఐ, డిప్లొమో, బి.టెక్, ఎం.ఎస్సి (ఆర్గానిక్ కెమిస్ట్రీ) ఉత్తీర్ణులైన 40 సం||లోపు అభ్యర్థులు అర్హులు. వీరికి నెలకు రూ.10,000/- నుండి రూ.20,000/ వరకు జీతం + ఇన్సింటివ్స్ భోజనం, వసతి & రవాణా సౌకర్యం ఆయా ఉద్యోగాలను బట్టి ఉంటుంది. ఆసక్తి గల అభ్యర్థులందరూ ఈనెల 19వ తేదీ శనివారం “వికాస కార్యాలయం, కలెక్టరేట్, రాజమహేంద్రవరం” వద్ద ఉదయం 9 గం||లకు సర్టిఫికెట్స్ జెరాక్స్తో హాజరుకావలెను. మరిన్ని వివరాలకు 83090 10013, www.vikasajobs.com సంప్రదించవలెను.
Tags rajamendri
Check Also
గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్
-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …