-కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ది 19.11.2022 న ఎస్. ఎస్. ఆర్. 2023, స్పెషల్ కెంపాయిన్ డేలో భాగముగా 80- సెంట్రల్ అసెంబ్లీ నియోజకవర్గముకి సంబంధించి, ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారి & మున్సిపల్ కమిషనర్ శ్రీ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్ విజయవాడ వారు 80- సెంట్రల్ అసెంబ్లీ నియోజకవర్గము పరిధిలోని వార్డ్ నెంబర్ .24, సూర్యరావ్ పేట , కర్నాటి రామమోహనారావ్ మునిసిపల్ హై స్కూల్ లో ఉన్నటువంటి పోలింగ్ బూత్ లు 151 నుండి 161 వరకు ఉన్న 11 స్టేషన్ లను పరిశీలించినారు. పోలింగ్ కేంద్రంలో ప్రతి పోలింగ్ స్టేషన్ నెంబర్ తప్పని సరిగా చూపించాలని, ప్రతి బి. యల్. ఓ వారికి సంబందించిన పోలింగ్ కేంద్రంలోని ఓటర్ల రేషియోని తప్పినసరిగా తెలుసుకోవాలని, లొకేషన్ మ్యాప్ ని తప్పనిసరిగా వారివద్ద ఉండవలెనని, 18 సంవత్సరముల వయస్సు వారిని కొత్త వోటర్లుగా నమోదు చేయవలసినదిగా సూచించారు మరియు కొత్త వోటర్ల నమోదు గురించి బ్యానర్ని పోలింగ్ లొకేషన్లో ఏర్పాటు చేయవలసినదిగా తెలిపినారు. ఫారం 6, 7, 8 గురించి బి. యల్. ఓల అవగాహన పరిశీలించారు మరియు 6బి ఫారంలను తప్పనిసరిగా ఓటర్ సంతకముతో తీసుకోవాలని మరియు ఫారంలను జాగ్రత్తగా భద్రము చేయవలేనని తెలిపినరు.