విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరంలో పిరమల్ క్యాపిటల్ హౌసింగ్ ఫైనాన్స్ వారి ప్రాపర్టీ అండ్ హోమ్ లోన్ ఫెస్టివల్ గృహోత్సవ కార్యక్రమం ప్రారంభించబడింది. స్టెల్లా కాలేజ్ సమీపంలోని సంయుక్త వేదికలో శనివారం ప్రారంభించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి డీసీపీ విశాల్ గున్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తక్షణమే హోమ్ లోన్స్ మంజూరుకు అవకాశం ఉండటం పేద మధ్యతరగతి కుటుంబీకులకు ఒక మంచి సదవకాశమన్నారు. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలని కోరారు. పిరమల్ క్యాపిటల్ హౌసింగ్ ఫైనాన్స్ వారిని అభినందించారు. నిర్వాహకులు మాట్లాడుతూ ఈ గృహోత్సవ కార్యక్రమం నవంబర్ 19, 20 తేదీల్లో రెండు రోజులు ప్రజలకు అందుబాటులో ఉంటుందన్నారు. లాగిన్ రుసుము 499 చెల్లించి, వడ్డీ రేటు పై 0.25 రాయితీ తో తక్షణమే మంజూరు చేయుటకు కృషి చేస్తూ కస్టమర్లకు మరిన్ని సేవలు అందించేందుకే తమ సంస్థ ద్వారా ఈ గృహోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ఇప్పుడు పరిస్థితుల్లో లోన్ అప్లై చేయాలంటే డాక్యుమెంటేషన్ చాలా ఇబ్బంది అవుతుందని, దాంతోపాటు చాలా సమయం పడుతుందని వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని వాటిని అధిగమించడానికి తక్షణమే లోన్ పొందేందుకు మార్గాన్ని సులభతరం చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది, కస్టమర్లు తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్
-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …