Breaking News

నగరంలో రజా స్టార్ బిర్యానీ ప్రారంభం…


విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కస్టమర్లు కోరుకునే విధంగా రుచికరమైన మేలురకమైన బిర్యానీ లను నగరవాసులకు అందించేందుకు రజా స్టార్ బిర్యానీ నగరంలో ప్రారంభించబడింది. ఈ కార్యక్రమానికి కార్పొరేటర్లు కే మల్లేశ్వరి బలరాం, బాలి గోవింద్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాణ్యమైన క్వాలిటీతో అందుబాటు ధరల్లో వివిధ రకాల పదార్థాలు నగరవాసులకు అందజేయటం అభినందనీయమని అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని బ్రాంచీలు ప్రారంభించి అభివృద్ధి చెందాలని శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రజా స్టార్ బిర్యానీ నిర్వాహకుడు జి జ్యోతి బాబు మాట్లాడుతూ నగరవాసులకు అతి తక్కువ ధరలతో సరిక్రొత్త రుచులుతో నగరం నడిబొడ్డులోని కొత్త వంతెన సమీపంలో, దుర్గాపురం, సాంబమూర్తి రోడ్డు, కర్మల భవన్ ఎదురు, రజా స్టార్ బిర్యానీస్ దర్బార్ ప్రారంభించామన్నారు. ఇండియన్, చైనీస్, బిర్యానీలు సరిక్రొత్త రుచులుతో అనేక రకాలు అందిస్తున్నామన్నారు. ప్రారంభోత్సవం సందర్భంగా ఈరోజు 149 రూపాయలకు దమ్+ ఫ్రై బిర్యానీ రెండు బిర్యానీలు బోనస్ గా అందజేస్తున్నామన్నారు. వివిధ రకాల రేట్లతో కస్టమర్లకు చికెన్, వేజ్ బిర్యాని అందజేస్తున్నమన్నారు. వీటితోపాటు చికెన్, మటన్ బిర్యానీ, ఫ్రైడ్ రైస్, చైనీస్, వెజ్ నాన్ వెజ్ స్నాక్స్, పుల్కా, కూల్ డ్రింక్స్, చికెన్ బిర్యాని, ఎగ్ బిర్యానీ, వెజ్ బిరియాని తదితర రకాల ఐటమ్స్ అందుబాటులో ఉంటాయన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విజయవాడ ఆయుర్వేద కళాశాలలో ఘనంగా 11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవ వేడుకలు

-ధన్వంతరి హోమం నిర్వహణ -సిసిఆర్ఎసి – స్పార్క్ స్కాలర్‌షిప్ చెక్కుల పంపిణీ -ప్రతిభావంతులైన విద్యార్థులకు అవార్డులు విజయవాడ, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *