డిసెంబర్ 3న జగ్గయ్యపేట ఎన్జీవోస్ ఎన్నికలు

జగ్గయ్యపేట, నేటి పత్రిక ప్రజావార్త :
ఏపీ ఎన్టీవోస్ అసోసియేషన్ జగ్గయ్యపేట ఎన్నికల నేపథ్యంలో ఎన్నికలకు నిర్వహించుటకు జిల్లా సహద్యకుడు సిహెచ్ శ్రీరామ్ ను ఎన్నికల అధికారిగా, జిల్లా సంయుక్త కార్యదర్శి బివివిఆర్ నాగేంద్రరావును సహాయ ఎన్నికల అధికారిగా, జిల్లా ఉపాధ్యక్షుడు యం రాజుబాబును ఎన్నికల పరిశీలకులుగా జిల్లా అధ్యక్షుడు ఎ విద్యా సాగర్ నియమించడం జరిగింది. ఎన్నికల అధికారి సిహెచ్ శ్రీరామ్ మాట్లాడుతూ జగ్గయ్యపేట తాలూకా పరిధిలో 172 మంది ఓటర్లు ఉన్నారని చెప్పారు. అధ్యక్ష కార్యదర్శితో పాటు మరో తొమ్మిది పదవులు కలవని మొత్తం 11 పదవులన్నారు. స్థానిక ఎన్జిఓస్ హోమ్ నందు ఓటర్ల జాబితా ప్రదర్శించటం జరిగిందన్నారు. ఓటర్ల జాబితాలో పేర్లు లేకపోయినా లేదా కొత్తగా ఎవరైన పేర్లు నమోదు చేసుకోవాలన్న ఈనెల 23 లోపు నమోదు చేసుకోవచ్చన్నారు. ఈనెల 26న నామినేషన్లు స్వీకరణ, డిసెంబర్ 3న ఎన్నికలు, అదే రోజు సాయంత్రం కౌంటింగ్ కూడా నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేసారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *