-డిసెంబర్ ఒకటవ తేదీన ఎంపిక ప్రక్రియ ఉదయం 9 నుంచి
– వేదిక : రాజమహేంద్రవరం, ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ కన్వెన్షన్ హల్ లో
-కలెక్టర్ మాధవీలత
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
యువతీ యువకులలో దాగివున్న ప్రతిభను వెలికి తీసి జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలలో వారి నైపుణ్యమును ప్రదర్శించుటకు 15-20 సంవత్సరములు మధ్య వయస్సు గల యువతీ, యువకులకు వివిధ సాంస్కృతిక అంశాలలో జిల్లా స్థాయిలో పోటీలను ఎంతో దోహదం చేస్తాయని జిల్లా కలెక్టర్ డా. కే. మాధవీలత పేర్కొన్నారు.
జిల్లా యువజన సంక్షేమ శాఖ, సెట్రాజ్ ఆధ్వర్యములో శనివారం స్థానిక జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయం లో జిల్లా స్థాయి యువజనోత్సవాలు సంస్క్రతిక ప్రదర్శనల పోస్టర్స్ ను కలెక్టర్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ డిసెంబర్ 1 వ తేదీ ఉదయం 9 గంటలు నుంచి రాజమహేంద్రవరం,కన్వెక్షన్ హాల్, ఆదికవి నన్నయ యూనివర్సిటీ లో సాంస్క్రతిక కార్యక్రమాల ప్రదర్శన నిర్వహించడం జరుగుతుందన్నారు.
అర్హులైన వారందరు ఈ నెల 29వ తేదీ సాయంత్రం 6 గంటలు లోగా ప్రదర్శన చేయు అభ్యర్థులు తమ పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. ఈ సందర్బగంగా జిల్లా యువజన సాంస్క్రతిక ప్రదర్శనల పోస్టర్ ను ఆవిష్కరించారు.
సెట్రాజ్, ముఖ్య కార్యా నిర్వాహణాధికారిణి
డి ఎస్ ఎస్ సునీత వివరిస్తూ.. జాతీయ స్థాయి అంశాలలో
శాస్త్రీయ నృత్యం: (వ్యవధి:(15 ని॥లు) విభాగంలో భరతనాట్యం, కధక్, కూచిపూడి, ఒడిస్సీ, మణిపురి అంశాలలో
శాస్త్రీయ గాత్ర సంగీతం:(వ్యవధి:15 ని.లు) అంశాలలో హిందూస్తానీ, కర్ణాటిక్, శాస్త్రీయ వాయిద్య పరికరములు, మృదంగం (వ్యవధి: 10 ని॥లు), ఫ్లూట్ (వ్యవధి: 15 ని॥లు), సితార (వ్యవధి: 15 ని॥లు), తబల (వ్యవధి: 10 ని॥లు), వీణ (వ్యవధి: 15 నిllలు), హార్మోనియం(లైట్)(వ్యవధి:10ని॥లు) , గిటార్ (వ్యవధి: 10 ని॥లు); వకృత్వం (ఎక్స్ టెంపోర్) (హిందీ మరియు ఇంగ్లీషు – వ్యవధి: 4 ని॥లు)సంబంధించిన టాపిక్స్: అంశములను పోటీలు నిర్వహించే సమయంలో ఇవ్వడం జరుగుతుందన్నారు.
గ్రూపు అంశాలలో జానపదగేయాలు (గ్రూపు) – (4 నుండి 10 మంది అభ్యర్థులు వుండాలి – వ్యవధి: 7 ని॥లు), జానపద నృత్యం (గ్రూపు) ముందుగా రికార్డింగ్ చేసిన సి.డి / సెల్ ఫోన్ ద్వారా పాటలు అనుమతించబడను. ప్రత్యక్ష సంగీత సహకారంతో పాటలు పాడవలెను. (కనీసం 8 నుండి 20 మంది అభ్యర్ధులు వుండాలి. వ్యవధి: 15 ని॥లు), వన్ యాక్టు ప్లే (హిందీ / ఇంగ్లీషు) (కనీసం 10 నుండి 12 మంది అభ్యర్థులు వుండాలి – వ్యవధి: 45 ని॥లు)
రాష్ట్ర స్థాయి అంశములలో భాగంగా ఎక్కువ మంది యువత వారి యొక్క ప్రతిభను వివిధ రంగాలలో నిరూపించుకొనుటకు గాను
వ్యక్తిగత అంశాలు (తెలుగులో) నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తెలుగు లో పాల్గొనే వారిని ప్రోత్సహించే క్రమములో జిల్లా స్థాయి మరియు రాష్ట్ర స్థాయి వరకు మాత్రమే పరిమితం చేయడం జరుగుతుందని అన్నారు.
వ్యవధి: 4 నిలు), మోనో యాక్షన్ (సోలో) (వ్యవధి: 10 ని॥లు), మిమిక్రి (సోలో)(వ్యవధి: 10 ని॥లు), మేజిక్ షో (సోలో)(వ్యవధి: 10 ని॥లు) , వెంట్రిలాక్విజం (సోలో) (వ్యవధి: 10 నిలు), వయోలిన్ (వ్యవధి: 10 ని॥లు, వకృత్వం (వ్యవధి: 4 ని॥లు), మోడరన్ సాంగ్ (సోలో) (వ్యవధి: 4 ని॥లు), మోడరన్ డ్యాన్స్ (సోలో) (వ్యవధి: 4 ని) వయోలిన్ (వ్యవధి: 10 ని॥లు), ఫ్యాన్సీడ్రస్, గ్రూపు డిస్క్క్షన్ (వ్యవధి: 20 ని॥లు), క్విజ్ (వ్యవధి: 20 ని॥లు), అడ్వేంచర్ యాక్టవిటీస్ (వ్యవధి: 20 ని॥లు, పెయింటింగ్ (వ్యవధి: 30 ని॥లు), స్కల్పర్స్ (వ్యవధి: 50 ని॥లు), ఆర్టిజన్ (వ్యవధి: 30 ని॥లు)
టాపిక్స్: దేశ భక్తి, సామాజిక మరియు ఆర్థిక ఉద్యమము (Socio-Economic Movement), పర్యావరణ పరిరక్షణ, ఆరోగ్యము, ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు మరియు స్వచ్ఛ భారత్ (మత పరమైన అంశాలు ఉండరాదు) మొదలగునవి సినిమా పాటలు లేదా అసభ్యకర పాటలు, డ్యాన్స్ లు అనుమతించబడవు.
నమోదు కొరకు ఆయా అంశాల్లో పాల్గొనే అభ్యర్థులు వయస్సు దృవీకరణ కొరకు ఏదైనా ధృవపత్రము (ఆధార్ కార్డు) నకలు తీసుకొని రావలెనని, క్షళాకారులు తమ సొంత వాయిద్య పరికరములతో, మేకప్ ఏర్పాట్లు తో హాజరు కావాలన్నారు.
* జిల్లా స్థాయిలో ప్రధమ స్థానం పొందిన వారిని రాష్ట్రస్థాయిలో నిర్వహించబడు పోటీలకు.. రాష్ట్రస్థాయిలో ప్రధమ స్థానం పొందినవారిని జాతీయ స్థాయిలో నిర్వహించబడు పోటీలకు ఉచిత ప్రయాణభత్యము, భోజన సదుపాయములతో పంపడం జరుగుతుందన్నారు.
” గత 3 సంవత్సరములలో రాష్ట్రస్థాయి యూత్ ఫెస్టివల్ కార్యక్రమములలో పాల్గొన్నవారు / టీమ్ సభ్యులు ఈ సంవత్సరము జరుగు పోటీలకు దరఖాస్తు చేసుకోవాడానికి అనర్హులు అని స్పష్టం చేశారు.
ముఖ్య గమనిక :
ఆశక్తిగల, ఉత్సాహవంతులైన యువ కళాకారులు వివరములు: ఈ క్రింది తెలిపిన గుగుల్ ఫారమ్ లింక్ నందు (లేదా) QR కోడ్ ద్వారాతమ వివరాలు నమోదు చేసుకోవచ్చును.
లింక్: https://docs.google.com/forms/d/e/
ఉత్సాహవంతులైన / చదువుకున్న, చదువులేని యువతీ, యువకులు ఈ సదవకాశమును ఉపయోగించు కోవలసినదిగా కోరడమైనది. సెట్రాజ్ కార్యాలయము, కాకినాడ
0884-2344913, 98499 13065, 8919135344 సంప్రదించ వచ్చునని ఆమె తెలిపారు.