విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరపాలక సంస్థ ఆధ్వర్యములో ఆదివారం కొత్తూరు తాడేపల్లి ఊరి మొదటలో ఉన్న రాజు గారి తోట నందు కార్తీక వనసమారధన కార్యక్రమము ఏర్పాటు చేయడమైనది. ఈ వనసమారధన కార్యక్రమమునకు పశ్చిమ నియోజక వర్గ శాసన సభ్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, శాసన మండలి సభ్యులు రుహుల్లా, కమీషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్, తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్, డిప్యూటీ మేయర్లు బెల్లం దుర్గ, అవుతు శ్రీ శైలజా రెడ్డి, కార్పొరేటర్లు, మరియు కో- ఆప్టేడ్ మెంబర్లు, ప్రజాప్రతినిధులు మరియు నగరపాలక సిబ్బంది పాల్గొనడం జరిగినది.
ఆనందం, ఆహ్లాదం, వినోదకరoగా గడుపుకోవాలనే ఉద్దేశ్యంతో ప్రతి సంవత్సరం ఈ కార్తీక వనసమారధన కార్యక్రమముతో ప్రజాప్రతినిధులు మరియు నగరపాలక సిబ్బందికి ఉత్సాహాన్ని నింపే విధంగా వివిధ రకములైన ఆటలా పోటీలు మరియు సాoస్కృతిక కార్యక్రమములు ఏర్పాటు చేయడమైనది.
ఈ సందర్భంలో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ నగరపాలక సంస్థ ఆధ్వర్యములో ఏర్పాటు చేసిన ఈ కార్తీక వనసమారధన కార్యక్రమమునకు విచ్చేసిన ప్రజాప్రతినిధులు మరియు నగరపాలక సంస్థ సిబ్బంది ధన్యవాదాలు తెలిపి మనమందరం నగరపాలక సంస్థ ఫ్యామిలీ లాగా కలిసి ఈ కార్యక్రమము జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని అందరు కూడా ఫ్యామిలీలతో వచ్చి ఇక్కడ సాయంత్రం వరకు ఎంజాయ్ చేయడం జరిగినదిని అన్నారు. విజయవాడ ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించుటలో నగరపాలక సంస్థ అనేక కోట్ల వ్యయంతో అభివృద్ధి సంక్షేమం అందించడంలో నగరపాలక సంస్థ ముందుంది అని మనమందరం కలిసి విజయవాడ నగరాన్ని ఇంకా అభివృద్ధి చేయాలనీ కోరుకుంటున్నాను అని అన్నారు.
అదే విధంగా కమీషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్ మాట్లాడుతూ ఆనందం, ఆహ్లాదం, వినోదకరoగా గడుపుకోవాలనే ఉద్దేశ్యంతో ఈ కార్తీక వనసమారధన కార్యక్రమమును ఏర్పాటు చేయడమైనదిని ప్రజలకు ఆనందకరoగా ఆట పాటలతో గడుపుకోవాలనే ఉత్సాహాన్ని నింపే విధంగా చిన్నారులలో కళాత్మక నైపున్యత గల నృత్యాలతో ప్రదర్శనలను ఏర్పాటు చేయుటం జరిగినది. నగరపాలక సంస్థ అనేక సందేశాత్మకమైన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తుoదని ప్రజల స్పందన కూడా ఎంతో బాగుందని రాబోవు రోజులలో ప్రజల సహకారంతో మరిన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని తెలియజేస్తూ, ప్రతి సంవత్సరం ఈ కార్తీక వనసమారధన కార్యక్రమమును ఏర్పాటు చేస్తామని తెలియజేస్తూ, ఈ కార్యక్రమమునకు వచ్చి పాల్గొని విజయవంతం చేసిన ప్రజాప్రతినిధులకు, నగరపాలక సంస్థ సిబ్బందికి మరియు మీడియా మీత్రులకు నా యొక్క ధన్యవాదాలు తెలిపినారు.
ఈ కార్యక్రమములో జరిగిన మ్యూజికల్ చైర్, టెన్నీకాయి, బ్యాడ్మింటన్, లెమన్ & స్పూన్, షాట్ పుట్, టగ్ ఆఫ్ వార్ ఆటలా పోటిలలో విజేతలకు మేయర్ మరియు కమీషనర్ చేతుల మీదుగా బహుమతులను అందజేసారు.
ఈ పోగ్రామ్ లో పాల్కొన్న స్కూల్ మరియు కాలేజి విద్యార్ధులకు నిర్వహించిన సాంస్కృతిక నాట్యలు, వ్యాస రచన, క్విజ్ తదితర పోటిలలో విజేతలకు బహుమతులను అందజేసారు.
అదే విధంగా కార్పొరేటర్లు కలసి ఈజీ ఆఫ్ లివింగ్ ఇండెక్స్-2022 కేంద్ర ప్రభుత్వం గృహకల్ప, పట్టణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో దేశంలోని నగరాల్లో జీవన ప్రమాణాలు, సుస్థిరమైన వసతులు, ఆర్ధిక వనరులపై సిటిజన్ పర్సెప్షన్ సర్వే చేస్తుందని తెలిపారు. ఈ సర్వేలో నగరంలో అందిస్తున్న వసతులపై ప్రశ్నావళి ఉంటుందని నగర వాసులందరూ ఈ సర్వేలో పాల్గొని జాతీయ స్థాయిలో మొదటి స్థానంలో నిలిచేలా సహకరించాలన్నారు. ఈ సందర్భంగా EOL – 2022 (ఈజీ ఆఫ్ లివింగ్ ఇండెక్స్-2022) బ్రోచర్స్ ఆవిష్కరించారు.
Prajavartha Online Telugu News