విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రకాశం జిల్లా తమ్మలూరు గ్రామం ఆర్యవైశ్య సంఘం కార్తీక వన సమారాధన కొత్తూరు తాడేపల్లిలోని అటవీశాఖ ఉద్యానవనంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ రుహుల్లా, విజయవాడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు కొనకళ్ల విద్యాధరరావు, వై.యస్.ఆర్.సి.పి వాణిజ్య విభాగం అధ్యక్షులు పల్లపోతు మురళీకృష్ణ హజరయ్యారు. అనంతరం వారిని సంఘం సభ్యులు సత్కరించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు కోట పుల్లారావు, మిత్తింటి చంద్రశేఖర్, కోట గుర్నాధరావు తదితరులు మాట్లాడుతూ ఇక్కడకు వచ్చి 50 సంవత్సరాలు అయి స్థిర నివాసం ఏర్పరుచుకున్న సందర్భంగా ఏర్పాటుచేసిన కార్తీక వన సమారాధనలో భాగంగా సత్యనారాయణ వ్రతం సుమారు 500 మందితో నిర్వహించుకున్నామన్నారు. కరోనా తర్వాత ఈ సంవత్సరం వివిధ ప్రాంతాల నుండి అన్ని కుటుంబాల వారు ఇక్కడికి వచ్చి ఒక్కటిగా చేరి క్షేమ సమాచారాలు తెలుసుకుని అందరి కుటుంబ సభ్యులతో గడపడం వల్ల కొంత వరకు ఆటవిడుపుతోపాటు మానసికోల్లాసం, మనోధైర్యం మాకు మావాళ్ళు వున్నారనే భరోసా పెరుగుతుందన్నారు. ఇటువంటి కార్యక్రమం అందరి కుటుంబాలతో ఆనందంతో ప్రతి సంవత్సరం నిర్వహించాలను కోరుకుంటున్నామన్నారు. పిల్లల కోసం వివిధ రకాల ఆటల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మిత్తింటి గోపీకృష్ణ, చిట్లూరి శ్రీనివాసరావు, తదితర సంఘ నాయకులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్
-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …