విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
క్షత్రియ సేవా సంఘం 40 వసంతాలు పూర్తి అయిన సందర్భంగా కార్తీక వన సమారాధన మహోత్సవ కార్యక్రమం కొత్తూరు తాడేపల్లిలోని తోటలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా నిర్వాహకులు క్షత్రియ సేవా సంఘం ప్రెసిడెంట్ టి.వి.ఎస్.ఆంజనేయరాజు, క్షత్రియ యువజన సంఘం ప్రెసిడెంట్ వలవర్తి రామరాజులు మాట్లాడుతూ క్షత్రియ సేవా సంఘం 40 వసంతాలు పూర్తి అయిన సందర్భంగా కార్తీక వన సమారాధన మహోత్సవ కార్యక్రమాన్ని అన్ని ప్రాంతాల నుండి వచ్చిన సుమారు 3 వేల మంది తమ కుటుంబాలతో ఆనందోత్సాహాలతో ఘనంగా నిర్వహించుకుంటున్నామన్నారు. కరోనా సమయంలో సుమారు 3 సంవత్సరాలపాటు ఈ కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నామని తిరిగి ఇప్పుడు ఈ సంవత్సరం నిర్వహించుకుంటున్నామన్నారు. ఇక ప్రతి సంవత్సరం నిర్వహించుకుంటామన్నారు. ఈ సందర్భంగా సత్యనారాయణ వ్రతం కార్యక్రమంలో అన్ని కుటుంబాల వారు పాల్గొన్నారు. పిల్లలు, కుటుంబ సభ్యుల కోసం ఆటపాటలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించామన్నారు. అవసరమైనపుడు తమవారికి వెంటనే రక్తాన్ని అందించడానికి బ్లడ్‌డోనేషన్ రిజిస్ట్రేషన్, వివాహ పరిచయవేదిక కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News