Breaking News

“ఆప్” రిలే నిరాహార దీక్ష విరమణ…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆమ్ ఆద్మీ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో “ప్రత్యేక హోదా ” కోసం గత మూడు రోజులుగా రిలే నిరాహార దీక్ష చివరి రోజు విజయవాడ ధర్నా చౌక్ లో నిర్వహిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక హోదా వస్తే పన్నుల రాయితీ ఉంటాయి రాష్ట్రంలో వైపు ఆకర్షితులైన పెట్టుబడిదారీ వ్యవస్థలు ఇతర చోట్ల నుంచి వచ్చి అనేక రాష్ట్ర ప్రయోజనాలకు ఉపయోగపడే విధంగా, చదువుకున్న యువకులకు భావి భవిష్యత్తు తరాలకు ఎంత ఉపయోగమో మూడు రోజుల నుంచి నిరాహార దీక్షలో పాల్గొన్న అనేక సంఘాల వారు, విద్యావేత్తలు, పలువురు ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర నాయకులు, యువకులు, పాల్గొని నిరసన కార్యక్రమం లో దీక్ష లో పాల్గొన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రత్యేక హోదా కోసం పోరాటం రిలే నిరాహార దీక్ష మూడవరోజు పూర్తి చేసుకుని విరమింప చేయడానికి స్కూలు విద్యార్థులచే నిమ్మరసం తీసుకుని దీక్ష విరమించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ మా కోసం కాదు మనకోసం భావితరాల భవిష్యత్తు కోసం అంటూ స్కూల్ డ్రెస్ లో ఉన్న స్కూలు విద్యార్థులచే నిమ్మరసం తీసుకొని ఈ దీక్ష విరమిస్తున్నామని ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర కన్వీనర్ కే.వి.బి వరప్రసాద్, రాష్ట్ర సలహాదారులు పోతిన వెంకటరమణ ,రాష్ట్ర నాయకులు జిఎస్ ఫణి రాజు, నరాల శివ కాకినాడ జిల్లా కన్వీనర్, గుండా శ్రీలక్ష్మి మహిళా కన్వీనర్ ప్రకాశం జిల్లా, నవీన్ రెడ్డి చంద్రగిరి నియోజకవర్గం ఇంచార్జ్, సీతల్ మదన్ రాష్ట్ర మహిళా కన్వీనర్, తదితర రాష్ట్ర నాయకులు ఈ మూడు రోజుల నిరసన దీక్షలో పాల్గొని జయప్రదం చేశారని రాష్ట్ర ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వానికి దేశ ప్రధానికి తదితర నాయకులకు కనువిప్పు అవగాహనతో తదుపరి పోరాటం కొనసాగించాలని ప్రత్యేక హోదా సాధించి తీరాలని ఉద్దేశంతో చేసిన ఈ కార్యక్రమం జయప్రదం అయిందని జీ.యస్. ఫణి రాజ్(ఆంధ్ర రాష్ట్ర ఆమ్ ఆద్మీ పార్టీ ఆందోళనలు మరియు నిరసనల విభాగ కన్వీనర్) అన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్

-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *