Breaking News

మహాత్మా జ్యోతిభా ఫూలే 133 వర్థంతి వేడుకలు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
భారత ఆహార సంస్థ, ఆంధ్ర ప్రదేశ్ రీజియన్ లో మహాత్మా జ్యోతిభా ఫూలే 133 వర్థంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. యఫ్ సి ఐ, ఏ పి రీజియన్ జనరల్ మేనేజర్ చంద్ర శేఖర్ జ్యోషి, జ్యోతిబా ఫూలే చిత్రపటానికి పూల మాలలు వేసి వందన నివాళి సమర్పించారు. ఈ కార్యక్రమం లో యఫ్ సి ఐ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. యఫ్ సి ఐ ఎక్జిక్యూటివ్ స్టాఫ్ యూనియన్ ఆంధ్ర ప్రదేశ్ రీజియన్ రాష్ట్ర అధ్యక్షులు కట్టా నాగార్జున మాట్లాడుతూ, కుల వివక్ష నిర్మూలన, బాలిక విద్య, వితంతు పునార్నివాసం కోసం మహాత్మా జ్యోతిభా తమ జీవితాన్ని అంకితం చేశారని కొనియాడారు. ఆయన అడుగు జాడల్లో నడుద్ధామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం లో ఎక్జిక్యూటివ్ స్టాఫ్ యూనియన్ అదనపు కార్యదర్శి  పొందూరు అశోక్ , ఉపాధ్యక్షుడు శివరామకృష్ణ , జోనల్ ఉపాధ్యక్షులు బర్రే రాము , ఇతర ఉద్యోగులు అందరూ ఘన నివాళులర్పించారు. ఎక్జిక్యూటివ్ స్టాఫ్ యూనియన్ తరుపున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో మహాత్మా జ్యోతిబా చిత్రపటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *