విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
భారత ఆహార సంస్థ, ఆంధ్ర ప్రదేశ్ రీజియన్ లో మహాత్మా జ్యోతిభా ఫూలే 133 వర్థంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. యఫ్ సి ఐ, ఏ పి రీజియన్ జనరల్ మేనేజర్ చంద్ర శేఖర్ జ్యోషి, జ్యోతిబా ఫూలే చిత్రపటానికి పూల మాలలు వేసి వందన నివాళి సమర్పించారు. ఈ కార్యక్రమం లో యఫ్ సి ఐ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. యఫ్ సి ఐ ఎక్జిక్యూటివ్ స్టాఫ్ యూనియన్ ఆంధ్ర ప్రదేశ్ రీజియన్ రాష్ట్ర అధ్యక్షులు కట్టా నాగార్జున మాట్లాడుతూ, కుల వివక్ష నిర్మూలన, బాలిక విద్య, వితంతు పునార్నివాసం కోసం మహాత్మా జ్యోతిభా తమ జీవితాన్ని అంకితం చేశారని కొనియాడారు. ఆయన అడుగు జాడల్లో నడుద్ధామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం లో ఎక్జిక్యూటివ్ స్టాఫ్ యూనియన్ అదనపు కార్యదర్శి పొందూరు అశోక్ , ఉపాధ్యక్షుడు శివరామకృష్ణ , జోనల్ ఉపాధ్యక్షులు బర్రే రాము , ఇతర ఉద్యోగులు అందరూ ఘన నివాళులర్పించారు. ఎక్జిక్యూటివ్ స్టాఫ్ యూనియన్ తరుపున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో మహాత్మా జ్యోతిబా చిత్రపటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు.
Tags vijayawada
Check Also
గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్
-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …