విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఓట్ల రాజకీయాలు చేయకుండా కులమత పార్టీలకతీతంగా అర్హతే ప్రామాణికంగా అందరికి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా మంగళవారం 4వ డివిజన్లోని 6వ సచివాలయ పరిధిలోని అంబేద్కర్ కాలనీ ప్రాంతాలలో వైస్సార్సీపీ నాయకులు,సచివాలయ సిబ్బంది, వాలంటీర్ లతో కలిసి ఇంటింటికి వెళ్లిన అవినాష్ ప్రభుత్వం ద్వారా వారి కుటుంబాలకు అందుతున్న సంక్షేమ లబ్ది వివరాలను అందజేశారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ గతంలో తెలుగుదేశం ప్రభుత్వం లో కేవలం ఓట్లు కోసం వారి పార్టీ వారికే సంక్షేమ పథకాలు అందించేవారని,ఏదైనా నియోజకవర్గంలో వారి పార్టీ వారు ఓడిపోతే అసలు అక్కడ అభివృద్ధి గురించి, ప్రజల గురించి పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేసేవారని విమర్శించారు.కానీ నేడు *జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక ప్రమాణస్వీకారం రోజు ఇచ్చిన మాట ప్రకారం గెలుపోటములతో సంబంధం లేకుండా అభివృద్ధి కార్యక్రమాలు, పార్టీలు చూడకుండా సంక్షేమ పథకాలు అందిస్తున్నారని,ఒకవైపు సంక్షేమం,మరోవైపు అభివృద్ధి కార్యక్రమాలతో రాష్ట్రన్ని పురోభివృద్ధి దిశలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నడిపిస్తున్నారు అని,మరో 30ఏళ్ళు ఆయనే ముఖ్యమంత్రి గా ఉండలని ప్రజలు కోరుతున్నారు అని చెప్పారు. ప్రజలలో రోజురోజుకు పెరుగుతున్న ఆదరణ చూసి ప్రతిపక్ష పార్టీల గుండెల్లో గుబులు పట్టుకొంది అని వారి పార్టీ భవిష్యత్ కోసం గాబరా పడుతున్నారని ఎద్దేవా చేశారు. తెలుగుదేశ పార్టీ నాయకులు ఎన్ని కుట్రలు చేసిన ప్రజల మద్దతు వైస్సార్సీపీ ప్రభుత్వానికి ఉందని ధీమా వ్యక్తంచేశారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ,డివిజన్ ఇన్ ఛార్జ్ గల్లా పద్మావతి, అంబేద్కర్ కాలని వాసులు కోన శరత్, వినోద్, సురేంద్ర, సునీల్, గల్లా రవి, మీర్ హుస్సేన్, జె.జె.సింగ్, పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్
-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …