Breaking News

ఏఐఎల్‌ఆర్‌ఎస్‌ఏ మహా ప్రదర్శన, బహిరంగసభ…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆల్‌ ఇండియా లోకో రన్నింగ్‌ స్టాఫ్‌ అసోసియేషన్‌ (ఏఐఎల్‌ఆర్‌ఎస్‌ఏ) స్వర్ణోత్సవ సంబరాలు, అసోసియేషన్‌ జాతీయ 23వ ద్వైవార్షిక మహాసభలను నగరంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. దీనిలో భాగంగా ఎంబివికే భవన్‌ నుండి జింఖానాగ్రౌండ్స్‌ వరకు మహా ప్రదర్శనను భారీ ఊరేగింపును నిర్వహించారు. ఈ మహా ప్రదర్శనలో ప్రజా నాట్యమండలి కళారూపాలు, శకటాలు, విచిత్ర వేషాలు, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వ హించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మహాసభలో సీఐటీయూ ప్రధానకార్యదర్శి తపన్సేన్‌, రైల్వే పార్లమెంటరీ స్టాండిరగ్‌ కమిటీ చైర్మన్‌ బాసుదేవ్‌ ఆచార్య, ఎమ్మెల్సీ కె.ఎస్‌.లక్ష్మణరావు, మజ్దూర్‌ యూనియన్‌ ప్రధాన కార్యదర్శి సి.హెచ్‌.శంకర్రావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ రౖెెల్వేతోపాటు ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణకు జాతీయ స్థాయిలో ఉద్యమం చేపట్టాల్సిన అవసరం వుందన్నారు. ఉద్యోగులపై పని ఒత్తిడి, పని గంటలు, మహిళా రన్నింగ్‌ స్టాఫ్‌కు మౌలిక సదుపాయాలు కల్పించాలని, రాత్రి డ్యూటీలను పరిమితం చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వరంగ సంస్థలు ప్రైవేటీకరణ చేయడం ద్వారా దేశ ప్రజల తీవ్రంగా నష్టపోనున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణ అయితే విలువైన రాయితీలు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు సన్నగిల్లుతాయన్నారు. కార్మిక లోకానికి ఎంతో చేటు కలిగించే లేబర్‌యాక్ట్‌ ఉపసంహరించుకునేంతవరకు ఉద్యమం కొనసాగించాలని పిలుపునిచ్చారు. ప్రైవేటీకరణ ప్రయత్నాలను సంఘటితంగా ఎదుర్కోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కన్వీనర్‌ టి.హనుమయ్య, కార్యదర్శి ఎస్‌.గురుమూర్తి, ఎన్‌ఎఫ్‌ఐఆర్‌ నాయకుడు పి.ఎస్‌. సూర్యప్రకాశం, సీఐటీయు నాయకులు ఎం.ఎ.గఫూర్‌, రాజీవ్‌గుప్తా, నిర్మల్‌ ముఖర్జీ, బి.వి. ఎన్‌. సత్యనారాయణ, సి.శ్రీకుమార్‌, ఎస్‌.పి.సింగ్‌, హరిలాల్‌ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *