గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరంలో వీధి వ్యాపారులను గుర్తించి, వారికి సమగ్ర విధానం అమలు చేస్తూ వెండింగ్ పాలసి అమలుకు చర్యలు తీసుకుంటున్నామని నగర కమిషనర్ శ్రీమతి కీర్తి చేకూరి ఐఏయస్ గారు తెలిపారు. మంగళవారం కమిషనర్ చాంబర్ లో పట్టణ ప్రణాళిక అధికారులు, మెప్మా సిబ్బంది, ట్రాఫిక్ పోలీసులు, వెండింగ్ కమిటి సభ్యులతో గుంటూరు నగర వెండింగ్ కమిటి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ గారు మాట్లాడుతూ వీధి వ్యాపారులకు ఎటువంటి సమస్యలు లేకుండా సమగ్ర విధానం తీసుకురానున్నామని తెలిపారు. ఇప్పటివరకు నగరంలో షుమారు 4800 మంది వీధి వ్యాపారులను గుర్తించడం జరిగిందని, వీరు కాకుండా నగరంలో ఇంకా ఎవరైనా వీధి వ్యాపారులు ఉంటే కమిటి సభ్యులు తదుపరి సమావేశంలో వివరాలు అందించాలని తెలిపారు. వీధి వ్యాపారుల పై జరిగే వేధింపుల పై అవగాహన ఉందని, వారి సమస్యల పరిష్కారానికి త్వరలోనే చర్యలు తీసుకుంటామన్నారు. గుర్తించిన వీధి వ్యాపారులకు గుర్తింపు కార్డ్ లు, వెండింగ్ సర్టిఫికేట్స్ అందించడం, వెండింగ్ జోన్లు ఏర్పాటు చేసి, ఆయా జోన్లలో వీధి వ్యాపారులకు మార్కింగ్ ఇస్తామన్నారు. నగరపాలక సంస్థ పరిధిలో వీధి వ్యాపారులు ఎదుర్కొనే సమస్యలపై ఆయా సంఘాల ప్రతినిధులు లేదా వెండింగ్ కమిటి ప్రతినిధులు తమ దృష్టికి తీసుకురావచ్చని తెలిపారు. అనంతరం వెండింగ్ పాలిసిలో బైలా, గ్రీన్, రెడ్, అంబర్ వెండింగ్ జోన్ల వివరాలను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా కమిటి సభ్యులకు వివరించారు. సమావేశంలో డిప్యూటీ కమిషనర్ బి.శ్రీనివాసరావు, సిటి ప్లానర్ మూర్తి, డిప్యూటీ సిటి ప్లానర్ కోటయ్య, ఏ.సి.పి.లు కాలేష, బాబురావు, అజయ్ కుమార్, ట్రాఫిక్ పోలీస్ అధికారులు, వెండింగ్ కమిటి సభ్యులు, సి.ఎం.ఎం.లు తదితరులు పాల్గొన్నారు.
Tags guntur
Check Also
గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్
-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …