విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు ఎన్.ఎస్.యు.ఐ. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆర్గనైజేషనల్ వేముల శ్రీనివాస్ అన్నారు. వేముల శ్రీనివాస్ వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ఆదివారం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని అజిత్‌సింగ్‌నగర్ మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో యువతతో మరియు ప్రజలతో మమేకమైన వారికి రాష్ట్రానికి ప్రత్యేక తరగతి హోదా వల్ల కలిగే ప్రయోజనాలను వివరిస్తూ ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అనే నినాదం గల బ్యాడ్జిలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వేముల శ్రీనివాస్ మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సుమారు 8 సంవత్సరాలు గడుస్తుందని బిజెపి ప్రభుత్వం 2014 జనరల్ ఎలక్షన్స్ తిరుపతి బహిరంగ సభలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకత హోదా ఇస్తానని హామీ ఇచ్చి ఇప్పుడు ప్రత్యేకత హోదా ముగిసిపోయిన అంశమని హోదా ఇవ్వలేమని 5 కోట్ల ఆంధ్రులను మోసం చేసిందన్నారు. సాక్షాత్ పార్లమెంట్ సాక్షిగా నాటి ప్రధాని, ప్రతిపక్ష నేతలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకత హోదా ఇస్తానని ప్రకటించారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక తరగతి హోదా సంజీవని లాంటిదని ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా వచ్చే వరకు జాతీయ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (ఎన్.ఎస్.యు.ఐ.) ఆంధ్రప్రదేశ్ తరపున పోరాటాలు చేస్తూనే ఉంటామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియజేయడమైనదన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి నాయకులు బత్తుల అంకమ్మరాజు, రాయవరపు రాజు, ఉప్పు జస్వంత్, ఎ.వెంకటేష్, సి.హెచ్.భాను ప్రకాష్, శశికాంత్ మరియు యువ నాయకులు రాయవరపు సాయి తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్
-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …