విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరంలో ఎపి టాక్స్ ప్రాక్టీషనర్స్ అండ్ కన్సల్టెంట్స్ అసోసియేషన్ మరియు ది ఎపి టాక్స్ బార్ అసోసియేషన్ సంయుక్తగా జీఎస్టీ అవగాహన సదస్సు-సెమినార్ నిర్వహించారు. ఆదివారం ఎంబివికె భవన్లో జీఎస్టీ అవగాహన సదస్సు-సెమినార్ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా గిరిజా శంకర్, ఐఎఎస్, చీఫ్ కమీషనర్ ఆఫ్ స్టేట్ టాక్స్, ఎపి, ఎం.వి.కె.మూర్తి, సుప్రీంకోర్టు అడ్వకేట్, పాస్ట్ ప్రెసిడెంట్ ఎఐఎఫ్‌టిపి, పి.వి.సుబ్బారావు, అడ్వకేట్లు హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని ఎస్.చక్ర రమణ ఎపిటిబిఎ, జాయింట్ సెక్రటరీ, కాన్పరెన్స్ కమిటీ నెంబర్ పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో సెషన్స్‌లో ప్యానల్ డిస్కషన్‌తోపాటు ప్రశ్నా సమాధాల ద్వారా తమకున్న అనుమానాలు, జరిగిన జరుగుతున్న మార్పులు, చేర్పుల తెలుసుకోవడం ద్వారా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ గవర్నమెంట్‌కు ఆదాయం రావాలంటే జీఎస్టీవల్లే జరుగుతుందని దీనిని 1 జూలై 2017లో ప్రారంభించారని గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ (జీఎస్టీ) గురించి వివరించారు. ఇవి డైరెక్ట్, ఇన్‌డైరెక్ట్ అనే రెండురకాల విధానాల ద్వారా అమలు అవుతుందన్నారు. మనకు తెలిసి కట్టే టాక్స్‌ను డైరెక్ట్ టాక్స్‌లు అంటే ఉదాహరణకు కార్పొరేట్ టాక్స్, వెల్త్ టాక్స్ తదితరాలు, అలాగే మనకు తెలియకుండానే కట్టే టాక్స్‌ను ఇండైరెక్ట్ టాక్స్ ఉదాహరణకు కొన్ని నిత్యావసర సరకులు కొనుగోలు, సర్వీస్ టాక్స్ తదితరాలు దీనికి పర్ఫెక్ట్ ఉదాహరణ జీఎస్టీ అని తెలిపారు. గతంలో సెంట్రల్, స్టేట్ టాక్స్‌లు వుంటే వాటిని తీసివేసి వన్ నేషన్, వన్ టాక్స్‌గా జీఎస్టీని గవర్నమెంట్ రూపొందించిందన్నారు. సెంట్రల్ జీఎస్టీ (సి జీఎస్టీ), స్టేట్ జీఎస్టీ (ఎస్ జీఎస్టీ), యూనియన్ టెరిటరీ జీఎస్టీ (యుటి జీఎస్టీ), ఇంటిగ్రేటెడ్ జీ ఎస్టీ(ఐ జీఎస్టీ)లు వుంటాయని తెలిపారు. వీటిలో కూడా శ్లాబ్స్ వుంటాయి. 0%, 5%, 12%, 18%, 28% శ్లాబ్స్ రూల్స్ అండ్ సర్వీసెస్‌పై ప్రకారం వుంటాయన్నారు. జీఎస్టీ క్రింద ఇన్స్పెక్షన్ మరియు ఆడిట్, ఈ-వేబిల్స్ మరియు ఇతర చిక్కులు తదితర అంశాలపై విషయ పరిజ్ఞానం కోసం అవగాహన సదస్సు ఉపయోగపడుతుందన్నారు. దీనివలన టాక్స్ ప్రాక్టీషనర్ ప్రభుత్వానికి వ్యాపారస్తులకు అనుసంధానం వుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో అవినాష్ అగర్వాల్, ఎం.రాజేష్, పి.వి.సుబ్బారావు, డాక్టర్ రామరాజు శ్రీనివాసరావు, అడ్వకేట్స్ పి.ఎస్.ఆర్.కె.ఫణికుమార్, జె.ఎన్.వి.సురేష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News