విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పు నియోజకవర్గంలో 10వ డివిజన్ ఫన్ టైం వెనుక రోడ్ లో జరిగిన అగ్ని ప్రమాదం బాధాకరమని వైసిపి తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ ఆవేదన వ్యక్తం చేశారు.. బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని,,ప్రభుత్వం తరుపున సహయo అందించే విధంగా కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు… ప్రమాదo గురించి తెలిసిన వెంటనే తూర్పు నియోజకవర్గం వైసీపీ ఇన్చార్జి దేవినేని అవినాష్ నిమిషాల వ్యవధిలోనే సంఘటన స్థలానికి వచ్చి అధికారం యంత్రాగాన్ని అప్రమత్తం చేసి సహాయ చర్యలు తీసుకున్నారు… అగ్నికి ఆహూతై ఇళ్లను కోల్పోయి నిరాశ్రయిలైన భాదితులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పి బాధితులకు దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వారికి భోజనాలు,నిత్యవసర సరుకులు పంపిణి చేసారు. ఈ సంద్భంగా అవినాష్ మాట్లాడుతూ…. ప్రమాదం ఎంతో బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు… ప్రభుత్వ యంత్రాంగం తరపున నష్టపోయిన ప్రతి ఒక్కరికి అన్ని విధాలా నష్టపరిహారం అందే విధంగా చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు.ఈ కార్యక్రమంలో వైస్సార్సీపీ నాయకులు పర్వతనేని బాబీ,కరుటూరి హరీష్ పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్
-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …