Breaking News

రవాణాశాఖ ఉద్యోగుల సంఘం రాష్ట్ర నూతన అధ్యక్ష కార్యదర్శిగా రఘుబాబు, ఉమ మహేశ్వరి

విజయవాడ , నేటి పత్రిక ప్రజావార్త :
రవాణాశాఖ నాన్ టెక్నికల్ ఉద్యోగుల రాష్ట్ర సంఘం ఎన్నికలలో ఐ రఘుబాబు, వి ఉమమహేశ్వరి ప్యానల్ సభ్యులు విజయం సాధించారని ఎన్నికల అధికారి ఏపీ ఎన్జీవోస్ పశ్చిమ కృష్ణ జిల్లా అధ్యక్షులు ఏ విద్యాసాగర్ తెలిపారు.

స్థానిక బందర్ రోడ్ లోని రవాణాశాఖ ఉద్యోగుల సంఘ భవనంలో ఆదివారం నాడు రవాణాశాఖ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఎన్నికలు నిర్వహించడం జరిగిందని ఎన్నికలలో గెలుపొందిన నూతన కార్యవర్గ సభ్యులతో ఎన్నికల అధికారి ఏ విద్యాసాగర్ ప్రమాణస్వీకారం చేపట్టారు. సహాయ ఎన్నికల అధికారిగా, ఏపీ ఎన్జీవోస్ జిల్లా కార్యదర్శి ఎండి ఇక్బాల్, ఎన్నికల పరిశీలకులుగా ఏపీ ఎన్జీవోస్ రాష్ట్ర సంఘ కార్యదర్శి ఏ రంజిత్ కుమార్ నాయుడు వ్యవహరించారు. ఎన్నికల అధికారి ఏ విద్యాసాగర్ మాట్లాడుతూ రవాణాశాఖ నాన్ టెక్నికల్ ఉద్యోగుల రాష్ట్ర సంఘానికి ఎన్నికల నిర్వహించడం 13 పోస్టులకు గాను 13 దరఖాస్తులు మాత్రమే రావడం జరిగిందని, ఏ పోస్టుకు పోటీ రాకపోవడంతో అన్ని సింగల్ నామినేషన్లుగా ధ్రువీకరిస్తూ ఐ రఘుబాబు వి ఉమామహేశ్వరి ప్యానెల్ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికైనరని ఆయన తెలిపారు. రాష్ట్ర అధ్యక్షులుగా ఐ రఘుబాబు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా వి ఉమామహేశ్వరి కోశాధికారిగా ఎం ఆనంద్ కుమార్ సహాధ్యక్షులుగా డి శ్రీనివాస్ కార్యనిర్వాహణ కార్యదర్శిగా కె జయప్రకాష్, ఉపాధ్యక్షులుగా యు బీనాకుమారి పి అనురాధ, వి రాకేష్ మధుకర్ బాబు, ఎం ఆర్ ఎం రాజు, సంయుక్త కార్యదర్శిలుగా సయ్యద్ కరిముల్లా, బి అనురాధ, ఏ బాలరాజు, ఇ రమాదేవి ఎన్నికయ్యారు నూతన అధ్యక్షుడు ఐ రఘుబాబు మాట్లాడుతూ ఉద్యోగులు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయనని ఉద్యోగుల ఎదుర్కొంటున్న సమస్యలను ఎప్పటికప్పుడు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుని వెళ్లి సమస్యలను పరిష్కరించే దిశగా ముందుకు వెళ్తానని కిష్టమైన సమస్యలను ఏపీ జేఏసీ దిష్టికి తీసుకువెళ్లి తద్వారా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన అన్నారు. ఉద్యోగులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై త్వరలోనే రాష్ట్ర ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుని వెళ్తామని ఆయన అన్నారు. ప్రధాన కార్యదర్శి వి ఉమామహేశ్వరి మాట్లాడుతూ రవాణశాఖ ఉద్యోగుల రాష్ట్ర సంఘం చరిత్రలో ఒక మహిళను రాష్ట్ర సంఘ ప్రధాన కార్యదర్శిగా నియమించడం చాలా ఆనందంగా ఉందని, ఇందుకు కృషి చేసిన సంఘ నాయకులకు సహకరించిన ఉద్యోగులకు రుణపడి ఉంటానని ఆమె అన్నారు.

ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో రాష్ట్ర సంఘం మాజీ అధ్యక్షులు జె రాజారావు, ఎం చిట్టిబాబు, డి మణికుమార్, నాలుగు జోన్ల అధ్యక్ష కార్యదర్శులు కృష్ణమోహన్, కిరణ్ యం రాజుబాబు, కెవివి నాగమురళి, ఎం శ్రీనివాసరావు, రాజీవ్, పి లక్ష్మీకర్ రెడ్డి, కె ఇనాయతుల్లా, ఎల్ వి ఆర్ కిషోర్, సిహెచ్ పైడ్రాజు, రాష్ట్ర సంఘ నాయకులు జోనల్ నాయకులు మరియు ఉద్యోగులు పాల్గొని నూతన కార్యవర్గ సభ్యులను అభినందించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్

-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *