విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేస్తున్న అభివృద్దే నినాదంగా రాబోయే ఎన్నికల్లో పోటీ చేసి ప్రజల మద్దతు తో ఘన విజయం సాధిస్తామని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ ధీమా వ్యక్తంచేశారు. గురువారం 18వ డివిజన్ రాణిగారితోట సిమెంట్ గౌడన్ నందు స్థానిక కార్పొరేటర్,ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ ఆధ్వర్యంలో 2కోట్ల 9లక్షల రూపాయల ప్రభుత్వ నిధులతో చేపట్టిన హై మాస్ట్ & సైడ్ లైటింగ్, వైయస్సార్ పార్క్, భూగర్భ డ్రైనేజ్, మంచినీటి పైప్ లైన్ మరియు సిమెంట్ రోడ్లు అభివృద్ధి కార్యక్రమాలకు మున్సిపల్ కమిషనర్ స్వప్నిల్ దినకర్, మేయర్ రాయన భాగ్యలక్ష్మి ల చేతుల మీదుగా జరిగిన శంకుస్థాపన కార్యక్రమానికి అవినాష్ ముఖ్య అతిథిగా హాజరై ఫౌండేషన్ స్టోన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ హయాంలో కాలనీలు, డివిజన్ లు అనే తేడా లేకుండా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని అన్నారు. ఈరోజు ప్రారంభించిన వైయస్సార్ పార్క్ లో మేయర్, కమిషనర్ ల సహకారంతో అన్ని మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసి కాలనీ ప్రాంతంలో ఉన్న పార్కులకు ధీటుగా అభివృద్ధి చేయడం జరిగిందని అన్నారు. గత ఐదు సంవత్సరాలు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కేవలం ఆ పార్టీ కార్పొరేటర్ లు గెలిచిన ప్రాంతంలో మాత్రమే అభివృద్ధి చేసారని, వైసీపీ పార్టీ బలంగా ఉన్న ఈ కృష్ణలంక, గుణదల ప్రాంతాలను పూర్తిగా నిర్లక్ష్యం చేసారని విమర్శించారు. కానీ నేడు ముఖ్యమంత్రి జగన్ గెలుపోటములతో సంబంధం లేకుండా రాష్ట్రం మొత్తం అభివృద్ధి చేయాలని సంకల్పంతో పని చేస్తున్నారు అని తెలిపారు. దానికి అనుగుణంగానే మన నియోజకవర్గంలో కోట్ల రూపాయలు వెచ్చించి కొండ ప్రాంతంలో, కృష్ణలంక ప్రాంతాల్లో కూడా మౌలిక సదుపాయాలు కల్పిస్తూ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని తెలిపారు. ప్రజలు ఏ నమ్మకంతో అయితే వైసీపీ ప్రభుత్వానికి మద్దతుగా నిలిచారో ఆ నమ్మకం నిలబెట్టుకునే విధంగా అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. వైసీపీ ప్రభుత్వం పనితీరుకు నిదర్శనం గా జాతీయ స్థాయిలో మన విజయవాడ మున్సిపాలిటీ కి స్వచ్ఛత,పరిశుభ్రత లో అనేక అవార్డులు వచ్చాయని చెప్పారు. అదేవిధంగా ఇచ్చిన మాట ప్రకారం ఈ ప్రాంత వాసుల చిరకాల కోరిక అయిన రిటైనింగ్ వాల్ నిర్మాణం పూర్తి చేయడంతో పాటు దాని చుట్టుపక్కల బ్యూటిఫికేషన్ పనులు కూడా చేపట్టి అధినికరించడం జరిగిందని, ఆ వాల్ నిర్మాణం వల్ల ఇటీవల కృష్ణానది కి 5లక్షల క్యూసిక్కుల నీరు వచ్చిన సరే ప్రజానీకం గుండెల మీద చెయ్యిసుకొని నిద్రపోయారని అన్నారు.ఇక్కడి ప్రజలు ఈ పార్కులో స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి విగ్రహం ఏర్పాటు చేయాలని కోరుతున్నారని వీలైనంత త్వరగా విగ్రహ ఏర్పాటు కు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. టీడీపీ లాగా శంకుస్థాపన లు చేసి వదిలేయకుండా వీలైనంత త్వరగా పనులు మొదలుపెట్టి ఎలాంటి నాణ్యత లోపం లేకుండా పూర్తి చేస్తామని అవినాష్ భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్లు బెల్లం దుర్గ, అవుతూ శైలజారెడ్డి, కార్పొరేటర్లు వెంకట సత్యనారాయణ, తంగిరాల రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి,మున్సిపల్ కమిషనర్ స్వప్నిల్ దినకర్,డిప్యూటీ మేయర్లు బెల్లం దుర్గ,అవుతూ శైలజారెడ్డి,17వ డివిజన్ కార్పొరేటర్ తంగిరాల రామిరెడ్డి మరియు వైస్సార్సీపీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు
Tags vijayawada
Check Also
గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్
-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …