Breaking News

ప్రోగ్రెసివ్ ఫ్రంట్ ప్యానల్ అభ్యర్ధులు వారికి కృతజ్ఞతలు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఈ నెల 4 తేదీన మున్సిపల్ కార్పొరేషన్ ఎంప్లాయిస్ కో-ఆపరేటివ్ సొసైటీ పాలక వర్గమునకు జరిగిన ఎన్నికల్లో ప్రోగ్రెసివ్ ఫ్రంట్ ప్యానల్ కు ఘన విజయము అందించిన సంఘ సభ్యులకు ధన్యవాదములు తెలిపి గురువారం నగరపాలక సంస్థ కార్యాలయంలో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి చాంబర్ల నందు మర్యాదపూర్వంగా కలిసి ప్రోగ్రెసివ్ ఫ్రంట్ ప్యానల్ మ్యానిఫెస్టో ను అమలు పరుచుటకు సహాయ సహకారము అందిచవలసిందిగా కోరగా ఉద్యోగ, ఉపాధ్యాయ కార్మికులకు మంచి చేయిటకు ఎల్లప్పుడూ ముందుంటామని తెలియజేసినారు. అందుకు ప్రోగ్రెసివ్ ఫ్రంట్ ప్యానల్ అభ్యర్ధులు వారికి కృతజ్ఞతలు తెలియజేసియున్నారు. ఈ కార్యాక్రమములో ప్రెసిడెంట్ గుంజా అజయ్ కుమార్, వైస్ ప్రెసిడెంట్ గుర్రం ఆంజనేయులు, సెక్రటరీ తిరుమారెడ్డి బ్రహ్మరెడ్డి, అసిస్టెంట్ సెక్రటరీ సింహాద్రి మస్తాన్ రావు, ఇతర డైరెక్టర్లు, వేజెండ్ల ప్రభావతి, భూపతి గోవింద రావు, గుంటక ప్రభాకర రెడ్డి, తోపుల శివ శంకర్, బచ్చు రాజేష్, తాడిశెట్టి నాగరాజు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *