-18వ డివిజన్ లో పలు అభివృద్ధికి పనులకు శంకుస్థాపన చేసిన,
-మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమీషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
-తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఈ రోజు తూర్పు నియోజక వర్గ సర్కిల్-3 పరిధిలోని 18 వ డివిజన్ లో రూ. 208.09 లక్షల నగరపాలక సంస్థ సాధారణ నిధులతో (రాణీ గారి తోట) సిమెంట్ గౌడన్ పార్క్ నందు అభివృద్ధి పనులకు నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ లచే శంఖుస్థాపనల కార్యక్రమములు ఏర్పాటు చేయడం జరిగినది. మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ తూర్పు నియోజకవర్గo పరిధిలోని ఎన్నడు లేని అభివృద్ధి పనులు మా ప్రభుత్వం చేపట్టినట్లు సుదీర్ఘకాలం లో ప్రాధమిక ఆరోగ్య కేంద్రలు కచ్చా రోడ్లతో మరియు 24 గంటలు నీటి సరఫరా కొత్తగా అభివృద్ధి చెందుతున్న అనేక కాలనీలు సైతం నేడు అభివృద్ధి పరచి ఇంకను జరుగుతున్న అభివృద్ధి పనులను త్వరగా జరిగేటట్లు చర్యలు తీసుకోవటం జరుగుతుందని అన్నారు. ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించుటలో నగరపాలక సంస్థ అనేక కోట్ల వ్యయంతో అభివృద్ధి కార్యక్రమములకు శంకుస్థాపన చేయుట జరిగిందని నిరంతరo నియోజక వర్గంలో అభివృద్ధిని పర్యవేక్షిస్తూ ముందుకు తీసుకువెళ్లటం అభినందనీయమని అన్నారు. నగర ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించుటతో పాటుగా చిన్న పిల్లలను ఆకర్షించే పార్క్ లను ఆధునీకరించుట జరుగుతుందని పేర్కొన్నారు. పార్టీలకు అతీతంగా అన్ని ప్రాంతాలు అభివృద్ది చేయాలన్నదే మా ప్రభుత్వం ఉద్దేశం అని పేర్కొన్నారు.
అదే విధంగా తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ మాట్లాడుతూ గత మూడున్నర సంవత్సరాలుగా నియోజకవర్గ పరిధిలో అనేక అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నవని ప్రజలకు మెరుగైన సౌకర్యలు కల్పించుటలో నగరపాలక సంస్థ అనేక కోట్ల వ్యయంతో అభివృద్ధి కార్యక్రమములకు శంకుస్థాపన చేసి వాటిని వదిలి వేయకుండా ప్రారంభించేలా చర్యలు తీసుకోవటం ముఖ్యమంత్రి వై.యస్.జగన్ గారి లక్ష్మo నగరాభివృద్ధి పరస్తూ శంఖుస్ధాపనలు చేసి వాటిని అందుబాటులోనికి తీసుకురావటం జరుగుతుందని వివరించారు.
ఈ సందర్భంలో కమీషనర్ మాట్లాడుతూ 18 వ డివిజన్ లో సి.సి.రోడ్లు, కమ్యూనిటి హాల్ పెయింటింగ్స్, ఫ్లోరింగ్ మరియు మిగిలిపోయిన వర్క్స్, భూగర్భ డ్రైనేజి, మంచినీటి సరఫరా పైప్‌లైన్స్, సైడ్ లైటింగ్ వర్క్స్ మరియు పచ్చదనంతో పాటుగా ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణo అందించాలనే లక్ష్యంగా పార్క్ ను అభివృద్ధి చేసి పున: ప్రారంభం చేపట్టిన్నట్లు కమిషనర్ తెలిపారు. నగరపాలక సంస్థ సాధారణ నిధులతో 208.09 లక్షలతో పలు అభివృద్ధి పనులకు శంఖుస్ధాపనలు చేసేమని అన్నారు. సిమెంట్ గౌడన్ నందు గల పార్కును ఇంకా ఉత్తమమైన పార్కుగా అభివృద్ధి చేసే విధంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. అదే విధంగా ప్రజలు కూడా నగరపాలక సంస్థ వారికి సహకరించి మీయొక్క వంతుగా పార్కులలో ఏర్పాటు చేసిన మొక్కలు, పూల కుండీలు గాని ఇతర వస్తువులను జాగ్రత్తగా చూసుకోవాలని డివిజన్లలో ఎటువంటి ఇబ్బందులు గాని సమస్యలు ఉంటే నగరపాలక సంస్థ వారికి తెలియజేయలసిందిగా కోరడమైనది.
కార్యక్రమములో డిప్యూటీ మేయర్లు బెల్లం దుర్గ, అవుతు శ్రీ శైలజా రెడ్డి, స్థానిక కార్పొరేటర్ & ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ, కార్పొరేటర్ తంగిరాల రామిరెడ్డి, మరియు జోనల్ కమిషనర్-3 డా. ఏ.రవిచంద్, ఇతర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.
అదే విధంగా మేయర్, కమీషనర్, తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్, డిప్యూటీ మేయర్లు, ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ, కార్పొరేటర్ తంగిరాల రామిరెడ్డి లతో కలసి ఈజీ ఆఫ్ లివింగ్ ఇండెక్స్-2022 కేంద్ర ప్రభుత్వం గృహకల్ప, పట్టణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో దేశంలోని నగరాల్లో జీవన ప్రమాణాలు, సుస్థిరమైన వసతులు, ఆర్ధిక వనరులపై సిటిజన్ పర్సెప్షన్ సర్వే చేస్తుందని తెలిపారు. ఈ సర్వేలో నగరంలో అందిస్తున్న వసతులపై ప్రశ్నావళి ఉంటుందని నగర వాసులందరూ ఈ సర్వేలో పాల్గొని జాతీయ స్థాయిలో మొదటి స్థానంలో నిలిచేలా సహకరించాలన్నారు. ఈ సందర్భంగా EOL – 2022 (ఈజీ ఆఫ్ లివింగ్ ఇండెక్స్-2022) బ్రోచర్స్ ఆవిష్కరించారు.
Prajavartha Online Telugu News