Breaking News

నగరంలో ఘనంగా  సి.ఎం.ఆర్. షాపింగ్ మాల్ ప్రారంభం…


విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరంలో సి.ఎం.ఆర్. షాపింగ్ మాల్ ను ఎం.జి.రోడ్ లో ఘనంగా ప్రారంభించారు. సి.ఎం.ఆర్. ఫౌండర్ & చైర్మన్ మావూరి వెంకటరమణ మేనేజింగ్ డైరెక్టర్ మావూరి మోహన్ బాలాజీ ఆధ్వర్యంలో జరిగిన ప్రారంభోత్సవ వేడుకలకు ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖామాత్యులు జోగి రమేష్, సినీ హీరో రామ్ పోతినేని, హీరోయిన్ మెహరిన్, వెల్లంపల్లి శ్రీనివాసరావు – శాసనసభ్యులు, విజవాడ వెస్ట్, కేశినేని శ్రీనివాస్ (నాని) – పార్లమెంటు సభ్యులు, విజయవాడ, మల్లాది విష్ణు – శాసనసభ్యులు, విజవాడ సెంట్రల్,  గద్దె రామ్మోహన్ – శాసనసభ్యులు, విజవాడ ఈస్ట్, మలినేని రాజయ్య – చైర్మన్, విజయ ఆగ్రో ప్రాడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, డా|| పి.గౌతవమ్ రెడ్డి – చైర్మన్ – ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైబర్ నెట్,  రాయన భాగ్యలక్ష్మి – విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్, బయానా మురళీకృష్ణ – సుజాత అసోసియేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్,  నాదేండ్ల రవీంద్ర కుమార్ – రవీంద్ర కార్పొరేట్,  కంకటాల మల్లిక్ – కంకటాల గ్రూప్ చైర్మన్,  కోనేరు శివ కాంచన లత – సెక్రటరీ కె.ఎల్. ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ట్రస్ట్ తదితరులు హాజరై షాపింగ్ మాల్ ను ప్రారంభించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా సి.ఎం.ఆర్. ఫౌండర్ & చైర్మన్ మావూరి వెంకటరమణ మాట్లాడుతూ… విజయవాడలో తమ సంస్థ 21 బ్రాంచిని ప్రపంచ స్థాయి షాపింగ్ అనుభూతిని కలిగించే విధంగా తీర్చిదిద్ది విజయవాడ ప్రజలను ఆకట్టుకునేలా ఏర్పాటు చేయటం జరిగిందన్నారు. మా ఈ షాపింగ్ మాల్లో వివిధ వైరైటీల వస్త్రాలను, బంగారు ఆభరణాలను నగర ప్రజలు ఆధరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సి.ఎం.ఆర్. ఫౌండర్ & చైర్మన్  మావూరి వెంకటరమణ, డైరెక్టర్ మావూరి వెంకట పద్మావతి, మేనేజింగ్ డైరెక్టర్  మావూరి మోహన్ బాలాజీ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్

-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *