Breaking News

నగరంలో ఎన్ వి ఆర్ ఎక్సక్లూజివ్ జ్యువెల్లరీ షోరూమ్ ప్రారంభం…


విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరంలో నల్లమల్లిస్ ఎన్ వి ఆర్ ఎక్సక్లూజివ్ జ్యువెల్లరీ షోరూమ్ ఘనంగా ప్రారంభించారు. గురువారం  ప్రకాశం రోడ్డు, ఎఫ్.ఎమ్ ప్లాజా నందు నల్లమల్లిస్ ఎన్ వి ఆర్ ఎక్సక్లూజివ్ జ్యువెల్లరీ షోరూమ్ అంగరంగ వైభవంగా ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీమంత్రి, పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు, సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే మల్లాది విషువర్ధన్, నగర మేయర్ భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్ డిప్యూటీ మేయర్లు బెల్లం దుర్గ, అవుతు శ్రీశైలజ రెడ్డి, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు కొనకళ్ళ విద్యాధరరావు, ప్రజాప్రతినిధులు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విజయవాడ నగరంలో అందరికీ అందుబాటులో ఉండేవిధంగా ఎన్ వి ఆర్ వ్యాపార సంస్థను ప్రారంభించడం అభినందననీయమని అన్నారు. మహిళలు మెచ్చేవిధంగా అన్ని రకాల జ్యువెలరీ అందుబాటు ధరలలో ఉన్నాయని అన్నారు. ఒంగోలు కేంద్రంగా ఎన్ వి ఆర్ వ్యాపార సంస్థ నమ్మకమైన వ్యాపార సంస్థగా పేరు గాంచిందని వాళ్ళు తెలిపారు. విజయవాడ నగరంలో ఇది మొట్టమొదటి శాఖ అని విజయవాడతో పాటు మరిన్ని శాఖలు రావాలని వాళ్ళు ఆకాక్షించారు.

అనంతరం ఎన్ వి ఆర్ అధినేత నల్లమల్లి బాలు మాట్లాడుతూ నల్లమల్లి  కుటుంబసభ్యులు జ్యువెలరీ రంగంలో 110 సంవత్సరాలు నుండి ఉన్నామని కస్టమర్లకు నమ్మకమైన జ్యువెలరీని అందిస్తున్నామని వివరించారు. ఒంగోలులో ప్రసిద్ధిగాంచిన తమ ఎన్ వి ఆర్ లో విజయవాడ నగర ప్రజలు ఎక్కువగా విచ్చేస్తున్నారని వాళ్ళ కోరిక మేరకు విజయవాడలో ప్రారంభించామని పేర్కొన్నారు.

 

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *