విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజల శ్రేయస్సు కోసం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలపై ఎవరూ ఎన్ని అడ్డంకులు పెట్టిన ఆపలేరని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ స్పష్టం చేశారు. శుక్రవారం నాడు గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 4వ డివిజన్ 8వ సచివాలయం పరిధిలో శ్రీనివాసానగర్ బ్యాంక్ కాలనీ ప్రాంతాల్లో నాయకులు, సచివాలయ సిబ్బంది, వలంటీర్లతో కలిసి పర్యటించిన అవినాష్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ క్యాలెండర్ ను ప్రజలకు అందజేశారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ వైస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాతే నవరత్నాలతో పేదల బ్రతుకుల్లో వెలుగులు నిండాయని, వారికి ఆర్థిక భరోసా కల్పించే దిశగా ప్రభుత్వ పాలన కొనసాగుతుంది అని అన్నారు. స్వర్గీయ దేవినేని నెహ్రూ ఎమ్మెల్యే గా ఉన్నప్పుడు ఈ డివిజన్ లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని మరలా నేడు జగన్ గారు ముఖ్యమంత్రి అయ్యాక మాత్రమే అభివృద్ధి చూస్తున్నామని ఇక్కడి కాలనీ పెద్దలు, ప్రజలు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు అని అన్నారు. కేవలం ఈ మూడేళ్ళ కాలంలోనే దాదాపు 9కోట్ల రూపాయల నిధులు వెచ్చించి కాలనీ పెద్దల సహకారంతో నూతన రోడ్లు, సైడ్ డ్రైనేజ్, పార్కుల నిర్మాణం చేపట్టడం జరిగిందని, పెద్దలు మా దృష్టికి తీసుకువచ్చిన ప్రతి సమస్యను పరిష్కారాయించామని తెలిపారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమి చెందిన సరే పద్మావతి గారు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన ప్రతి హామీ అమలుకు కృషి చేస్తున్నారు అని కొనియాడారు. ప్రజలలో రోజురోజుకు జగనన్న కు పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేక వారి పార్టీ భవిత్యం మీద బెంగతో ప్రతిపక్ష పార్టీలు పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారు అని విమర్శించారు. వారు ఎన్ని కుట్రలు చేసిన, ఎంత అసత్య ప్రచారాలు చేసిన ప్రజలు నమ్మే పరిస్థితి లేదని వారి సంపూర్ణ మద్దతు ప్రభుత్వనికి ఉందని ధీమా వ్యక్తంచేశారు. ఇదేమి ఖర్మ అని ప్రజలు అనుకోబట్టే టీడీపీ ని ఘోరంగా ఓడించారని, మీరు ఎన్ని జిమ్మిక్కులు చేసిన మీ పార్టీ కోలుకోవడం కష్టమేనని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ప్రతి కుటుంబాన్ని తన సొంత కుటుంబంలా భావించి జగనన్న అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్నారు అని అన్నారు. ఈ కార్యక్రమంలో 4వ డివిజన్ ఇంచార్జ్ గల్లా పద్మావతీ,డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ,కొరివి చైతన్య,బొడ్డు తరుణ్ తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్
-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …