Breaking News

పొట్టి శ్రీరాముల ప్రాణ త్యాగం సీమాంధ్ర ప్రజల్లో ఆంధ్ర రాష్ట్ర ఉనికిని కాపాడటం కోసం ఆంధ్ర వాదం రగిలించాలి… : నేతి మహేశ్వర రావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అమరజీవి పొట్టి శ్రీరాముల ప్రాణత్యాగం తో వచ్చిన రాష్ట్రాన్ని కాపాడుకోవలిసిన బాధ్యత సీమాంధ్ర పౌరులుగా ప్రతి ఒక్కరి మీద ఉందనుకోవాలి అని ఆంధ్రప్రదేశ్ ప్రొఫెషనల్ ఫోరమ్ అధ్యక్షుడు నేతి మహేశ్వర రావు అన్నారు. గురువారం స్థానిక గాంధీనగర్ ప్రెస్క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రొఫెషనల్ ఫోరమ్ అధ్యక్షుడు నేతి మహేశ్వర రావు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ని విడగొట్టి ఢిల్లీ ఆంధ్రప్రదేశ్ కి అప్పులు పంచి, ఆస్తులు పంచక పోవటం, అలాగే ఆంధ్రప్రదేశ్ కి ఇచ్చిన హామీలు మర్చిపోవటం, అలాగే ఆంధ్రప్రదేశ్ మొత్తం రాజకీయ వ్యవస్థని తన గుప్పిట్లో పెట్టుకొని సీమాంధ్రకు తీరని అన్యాయం చేస్తుంది అనుకోవాలి అని అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు కులాలు పార్టీల వారీగా విడిపోవటం ఆంధ్రప్రదేశ్ కి జరిగిన నష్టాన్ని గుర్తించలేక పోవటం ఒక కారణం అని అలాగే రాజకీయ వ్యవస్థ కూడా ఢిల్లీ మీద గట్టిగ మాట్లాడటానికి భయపడే పరిస్థితి ఉందని అభిప్రాయ పడుతున్నాము అన్నారు. ఈ పరిస్థితి నుంచి బయటం పడాలంటే మనందరం పొట్టి శ్రీరాముల స్పూర్తితో జై ఆంధ్రప్రదేశ్ స్ఫూర్తి నింపుకొన్న నాడు ఢిల్లీ కి మన గళం గట్టిగ విన్పిస్తుంది అని ఆంధ్రప్రదేశ్ ప్రొఫెషనల్ ఫోరమ్ భావిస్తుంది అన్నారు. రాష్ట్రంలో ప్రస్తుత ఆర్థిక ఎమర్జెన్సీ పరిస్థితికి జీతాలు కూడా చేలించలేని స్థితికి మనల్ని అడ్డగోలుగా విభజించిన కేంద్రం ఇచ్చిన హామీలను మర్చిపోవటం కూడా ఒక కారణం అని అన్నారు. విభజన ద్వారా లక్ష కోట్లకు పైగా అప్పులు పంచి మనకు రావలిసిన ఆస్తులు 1.47 లక్షల కోట్లకు పైగా పంచక పోవటం అలాగే మన రాజకీయ వ్యవస్థ మాట్లాడలేక పోవటం చూస్తుంటే బాధేస్తుందని దీనికి ముఖ్య కారణం మనకు మన పూర్వికులు చేసిన త్యాగం తెలియక పోవడమే అనుకోవాలి అన్నారు. పౌర సమాజం గా మనందరి బాధ్యత రాష్ట్రము కోసం ప్రాణత్యాగం చేసిన అమరజీవి స్ఫూర్తిని రగిలించటం, తద్వారా మనకి జరిగిన అన్యాయాన్ని గట్టిగ ఢిల్లీని ప్రశ్నించమని వత్తిడి తీసుకొని రావటం మన లక్ష్యం కావాలి అన్నారు. రాష్ట్రంలో ఎవరైనా రాయలసీమ ఉత్తరాంధ్ర మద్యాంధ్ర అంటూ మన మధ్య విభజనకి ప్రయత్నిస్తే అటువంటి వారికి గట్టి బుద్దిచెప్పాలి అని ఇంకా గట్టి ప్రజలు నిలదీసే పరిస్థితి రావాలి అంటే జై ఆంధ్రప్రదేశ్ ఉద్యమ స్ఫూర్తి నింపుకోవాలి అన్నారు. రాష్ట్రంలో రాజకీయ పార్టీలు రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయము మీద మాట్లాడాలి అని అలాగే అవసరమైతే ఢిల్లీ ని ఎదిరించే పరిస్థితికి ఎదగాలని ఆంధ్రప్రదేశ్ ప్రొఫెషనల్ ఫోరమ్ కోరుకొంటుంది అన్నారు కానీ మన దౌర్బాగ్యం కేంద్రం మనకి అన్యాయం చేసినప్పటికీ ఢిల్లీ తో గట్టి బంధం కోసం అర్రులు చాచటం చూస్తుంటే మనల్ని ఈ రాజకీయ వ్యవస్థ ఎంత అఘాధం లో కి నెట్టు తున్నాయో అర్ధం అవుతుంది అన్నారు. రాష్ట్రము నుంచి వలసలతో సీమాంధ్ర జాతే కనుమరుగయ్యే పరిస్థితి నుంచి బయటపడేయగలిగే తారక మంత్రం “ఆంధ్రవాదం” అని అలాంటి ఆంధ్ర వాదానికి స్ఫూర్తి ప్రదాత రాష్ట్రము కోసం ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాముల అకుంఠిత దీక్ష గుర్తుచేసుకోవటం ద్వారనే సాధ్యమవుతుందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఆంద్రవాదము మొదట తరువాత ఆయా ఆయా పార్టీ ల వాదం ఆపైన ఆయా కులాల వాదం ముందుండాలి కానీ మన దౌర్బాగ్యం వ్యక్తి స్వామ్యం పార్టీల వాదం కుల వాదాల మత్తులో మన జాతికి జరుగుతున్న అన్యాయాన్ని సంఘటితం గా ఎదుర్కొనాలకే పోతున్నాము అనుకోవచ్చు అని తెలిపారు దాన్ని తిప్పికొట్టాలి అంటే “ఆంధ్రవాదం” ముందుకు రావాలి అని దాని కోసం ప్రతి ఒక్కరు పొట్టి శ్రీరాముల స్పూర్తితో పనిచేయాలని అన్నారు

నవతరం జాతీయ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని పార్టీలు రాష్ట్ర సమస్యల కన్న బీజేపీ తో బంధం కోసమే తహతహ లాడటం చూస్తుంటే బాధేస్తుంది అన్నారు. ప్రత్యేక హోదా పోరాట పరిషత్తు అధ్యక్షులు చింతా రాజశేఖర్ రావు, ప్రధాన కార్యదర్శి బేతు రామ్మోహన్ ప్రత్యేక హోదాకోరుతూ ప్రతిజ్ఞ చేయించారు.

సీనియర్ జర్నలిస్ట్ నగేష్ బూర్తి మాట్లాడుతూ రాష్ట్రము లో పార్టీలకతీతం గా ఉద్యమాన్ని నిర్మించాలి అంటే పొట్టి శ్రీరాములు స్ఫూర్తిని ప్రాణత్యాగాన్ని ప్రతి ఒక్కరికి తెలిసేలా ఉద్యమ కార్యచరణ ఉండాలి అని అన్నారు. జై బీమ్ భారత్ పార్టీ నాయకులు కొండలరావు, పొట్టి శ్రీరాములు స్పూర్తితో రాష్ట్రంలో రాష్ట్రము కోసం మాట్లాడే మూడో పార్టీ రావలిసిన ఆవశ్యకత ఎంత అయినా ఉందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రొఫెషనల్ ఫోరమ్ సెక్రటరీ బొప్పన రాజశేఖర్ రావు ఆధ్వర్యంలో పూలమాల వేసి నివాళులు అర్పించటం జరిగిందని తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్

-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *