Breaking News

“తానా “సాంస్కృతిక కళో త్సవాలు


విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఉత్తర అమెరికా తెలుగు సంఘం తానా ఫౌండేషన్ ఆధ్వర్యంలో తానా సంస్కృతి కళోత్సవములు ఈనెల 19వ తేదీ కేఎల్ యూనివర్సిటీలో ఆర్ అండ్ బి ఆడిటోరియంలో ఆంధ్ర ప్రదేశ్ తానా ప్రెసిడెంట్ అంజయ్యచౌదరి లావు, తానా ఫౌండేషన్ చైర్మన్, వెంకటరమణ యార్లగడ్డ నిర్వాహంలోజరుగుతాయని గురువారం స్థానిక గాంధీనగర్ ప్రెస్క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో కమ్యూనిటీ సర్వీసెస్ కోఆర్డినేటర్ రాజా కసుకుర్తి మాట్లాడుతూ మరుగున పడిన ప్రాచీన తెలుగు కళలు లను ప్రదర్శించాలని అద్భుత కళాధామం ,అంకిత సేవ భావం, అనే నినాదంతో తానా కళోత్సవ వేడుకలు జరుగుతాయనికూచిపూడి, కోలాటం, హరికథలు, బుర్రకథలు ,గంగిరెద్దుఆటలు, ప్రదర్శన ఉంటాయని, మెగా మెడికల్ క్యాంపు నిర్వహిస్తామని ఆడవారికి క్యాన్సర్ వ్యాధినుండి నిపుణులైన డాక్టర్లతో వైద్యం చేయిస్తామని విద్యార్థుల్లో అవగాహన కల్పిస్తామని రైతులు వ్యవసాయం గురించి పాడి రైతులు కు పశువుల మేత ,డైరీ అవగాహన కల్పిస్తామని అన్నారు. స్పోర్ట్స్ కోఆర్డినేటర్ తానా శశాంక్ యార్లగడ్డ మాట్లాడుతూ తానా నిర్వహించు కార్యక్రమాల్లో స్పోర్ట్స్ ముఖ్య భాగమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జిజ్ఞాస డైరెక్టర్ వై భార్గవ్,గాయత్రి వరిగొండ, శ్రీదేవి ,బన్సీ ,నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *