Breaking News

విద్యారంగం అభివృద్ధిలో ప్రైవేట్‌ సంస్థల భాగస్వామ్యం అభినందనీయం

-జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విద్యారంగం అభివృద్ధికి ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు తోడు ప్రైవేట్‌ స్వచ్చంద సంస్థ భాగస్వామ్యం కావాడం అభినందనీయమని జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు అన్నారు. ఏ కొండూరు మండలం కృష్ణారావుపాలెం గురుకుల పాఠశాల భోజన శాల అభివృద్ధికి రామ్‌కో ఇండస్ట్రీస్‌ ప్రతినిధులు లక్ష రూపాయల విరాళాన్ని గురువారం నగరంలోని కలెక్టర్‌ కార్యాలయంలో జిల్లా కలెక్టర్‌ డిల్లీరావును కలిసి అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ విద్యారంగం అభివృద్ధికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ప్రత్యేక శ్రద్ద తీసుకుని వినూత్నమైన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారన్నారు. నాడు`నేడు పథకం ద్వారా పాఠశాలల అభివృద్ధి అదనపు గదుల, వంటగదులు, మరుగుదొడ్లు, ప్రహరిగోడల నిర్మాణం, పెయింటింగ్‌, గ్రీన్‌ చాక్‌బోర్డ్‌ ఏర్పాటు, విద్యుత్‌ ఫ్యాన్లు, రక్షిత త్రాగునీటి సౌకర్యం వంటి అభివృద్ధి పనులకు కోట్లది రూపాయలను మంజూరు చేస్తున్నారన్నారు. మన రాష్ట్రంలో విద్యారంగంలో చేపట్టిన సంస్కరణలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచ్చాయన్నారు. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి చర్యలకు ప్రైవేటు సంస్థలు స్వచ్చంద సంస్థ భాగస్వామ్యం తోడైతే విద్య రంగం మరింత అభివృద్ధి పదంలో పయనిస్తుందన్నార. ఇటీవల తాను ఏ కొండూరు మండలం కృష్ణారావు పాలెంలోని సంఫీుక సంక్షేమ గురుకుల పాఠశాలను సందర్శించిన సమయంలో విద్యార్థులు భోజనం చేసిన అనంతరం వాష్‌ ఏరియా వెళ్లినప్పుడు కోతుల బెడదను ఎదుర్కొంటున్నారని గుర్తించి ఆ ప్రాంతంలో షెడ్డును నిర్మించేందుకు చర్యలు తీసుకుంటామని హామి ఇవ్వడం జరిగిందన్నారు. షెడ్డు నిర్మాణానికి సహకరించాలని అధికారులు రామ్‌కో సంస్థ దృష్టికి తీసుకురాగా కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్స్‌బులిటి ఫండ్స్‌ నుండి లక్ష రూపాయలు విరాళాన్ని రామ్‌కో ఇండస్ట్రీస్‌ ఆస్‌బెక్టాస్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ సంస్థ అందజేయడం పట్ల అభినందనలు తెలియజేస్తున్నానన్నారు. దీనిని స్పూర్తిగా తీసుకుని విద్యా రంగం అభివృద్దికి సహకరించేందుకు దాతలు ముందుకు రావాలని జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు కోరారు.
విరాళాని అందించిన వారిలో రామ్‌కో ఇండస్ట్రీస్‌ ఆస్‌బెక్టాస్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ సంస్థ ఎజియం పి. ఆనందరావు, హెచ్‌ఆర్‌ అడ్మిన్‌ డిప్యూటి మేనేజర్‌ టి జి రామ్మోహన్‌, పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డ్‌ ఎన్విరాన్‌మెంట్‌ ఇంజనీర్‌ టి. ప్రసాద్‌రావు ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్

-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *