Breaking News

నేటి (శనివారం) నుంచే ఏకలవ్య మోడల్ స్కూల్స్ జాతీయ క్రీడలు-2022

-ఇందిరీ గాంధీ మున్సిపల్ స్టేడియంలో ప్రారంభోత్సవం
-హాజరుకానున్న కేంద్ర గిరిజన వ్యవహారాల సహాయమంత్రి శ్రీమతి రేణుకా సింగ్ సరుటా
-22 రాష్ట్రాల నుంచి తరలివచ్చిన 4,300 మందికి పైగా విద్యార్ధులు
-వేదికలుగాఆచార్య నాగార్జున యూనివర్సిటీ, ఆంధ్రా లయోలా కళాశాల

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఏకలవ్య ఆదర్శ గురుకుల పాఠశాలల జాతీయ క్రీడలు-2022 కు అంతా సిద్ధమైంది. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఆతిథ్యమిస్తున్న ఈ క్రీడలకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డిగారు ఈ మెగా ఈవెంట్ ను ఏపీలో నిర్వహించేలా చొరవ తీసుకొగా.. గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీగారు, గౌరవ కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రివర్యులు శ్రీ అర్జున్ ముండా గారు ఈ క్రీడలపై ప్రత్యేక దృష్టిపెట్టారు.అలాగే గౌరవ ఉపముఖ్యమంత్రి మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీ పీడిక రాజన్నదొర గారు.. క్రీడల ఏర్పాట్లను నిత్యం పర్యవేక్షిస్తూ అధికారులకు దిశా నిర్దేశం చేశారు. జాతీయ నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్ (NESTS) ఆధ్వర్యంలో ఎకలవ్య ఆదర్శ గురుకుల పాఠశాలల జాతీయ క్రీడలు జరుగుతున్నాయి. ఈ ఈవెంట్ నిర్వహణలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్ర గిరిజన వ్యవరాల మంత్రిత్వ శాఖ పూర్తి సహాయక సహకారాలు అందిస్తోంది.

డిసెంబర్ 17 నుంచి 22 వరకు జరగనున్న ఈ క్రీడలకు విజయవాడ, గుంటూరు నగరాలు ఆతిథ్యమిస్తున్నాయి. విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో శనివారం జరిగే ప్రారంభ వేడుకలకు కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ సహాయమంత్రివర్యులు శ్రీమతి రేణుక సింగ్ సరుట హాజరవుతున్నారు. స్పోర్ట్స్ మీట్ ను ప్రారంభించిన అనంతరం ఆమె విద్యార్థులకు సందేశమిస్తారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున గౌరవ ఉపముఖ్యమంత్రి మరియు గిరిజన సంక్షేమ శాఖమాత్యులు శ్రీ పీడిక రాజన్నదొర గారితో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, గిరిజన సంక్షేమ శాఖతో పాటు పలు శాఖల ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. సాయంత్రం 5గంటలకు ప్రారంభం కానున్న ప్రారంభవేడుకల్లో ఆయా రాష్ట్రాల మార్చ్ ఫాస్ట్ ఉంటుంది. ఈ సందర్భంగా గిరిజన విద్యార్థులు సాంప్రదాయ నృత్యాలను ప్రదర్శించనున్నారు.

ఈనెల 18 నుంచి 21 వరకు విజయవాడలోని ఆంధ్ర లయోలా కాలేజీ, గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ క్రీడాప్రాంగణాల్లో పోటీలు జరగనున్నాయి. 22 రాష్ట్రాల నుంచి దాదాపు 4300 మందికి పైగా పాల్గొంటున్నారు. 22 క్రీడల్లో పోటీలు జరుగనుండగా.. వాటిలో 15 వ్యక్తిగత, 7 టీమ్ గేమ్స్ జరగనున్నాయి. పలు ఈవెంట్లలో అండర్-14, అండర్-19 విభాగాల్లో పోటీలు నిర్వహిస్తూండగా.. బాలురు, బాలికలకు విడివిడిగా ఈవెంట్లు ఉంటాయి. ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్స్, హ్యాండ్ బాల్, చెస్ నాగార్జున యూనివర్సిటీలో.. హాకీ, ఫుట్ బాల్, బాక్సింగ్, జూడో, తైక్వాండో క్రీడలకు విజయవాడ లయోలా కాలేజీలో జరుగనున్నాయి. టెన్ని్స్ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియం, స్విమ్మింగ్ విజయవాడ గాంధీనగర్ లోని వీఎంసీ జింఖానా స్విమ్మింగ్ పూల్, బ్యాడ్మింటన్ విజయవాడ పటమటలోని CHRK ఇండోర్ స్టేడియంలో జరుగనున్నాయి.

ఎకలవ్య ఆదర్శ గురుకుల పాఠశాలల జాతీయ క్రీడల్లో పాల్గొనేందుకు వచ్చిన విద్యార్థులు, కోచ్ లు, సిబ్బందికి విజయవాడలోని ఆంధ్రా లయోలా కళాశాల, ఆచార్య నాగార్జున యూనివర్సిటీల్లో వసతి సౌకర్యాలు కల్పించారు. ప్రతి రోజు 7వేల మందికి భోజనాలు అందించేలా ప్రత్యేక బృందాన్ని నియమించారు. జాతీయ క్రీడల్లో పాల్గొనేందుకు వచ్చిన క్రీడాకారులకు భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. స్పోర్ట్స్ మీట్ జరిగే వేదికలను సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉంచింది. రెండు వేదుకల్లో వందలాది సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. క్రీడాకారులను వేదికలకు తరలించేందుకు దాదాపు 50 ఆర్టీసీ బస్సులను సిద్ధంగా ఉంచారు. విజయవాడ, గుంటూరు రైల్వే స్టేషన్లతో పాటు గన్నవరం ఎయిర్ పోర్టులో హెల్ప్ డెస్కులను ఏర్పాటు చేసి క్రీడాకారులకు సమాచారం ఇస్తున్నారు. అలాగే రెండు అటు నాగార్జున యూనివర్సిటీ, ఇటు ఆంధ్రా లయోలా కళాశాలలో కమాండ్ కంట్రోల్ సెంటర్స్ ఏర్పాటు చేసి ఎలాంటి సమస్యలు తలెత్తకుండా గిరిజన సంక్షేమ శాఖ ఏర్పాట్లు చేసింది.

ఎకలవ్య మోడల్ రెసిడెన్షియల్స్ స్కూల్స్ నేషనల్ స్పోర్ట్స్ గేమ్స్ కు రాష్ట్ర ప్రభుత్వంలోని వివిధ శాఖలు సహకారం అందిస్తున్నాయి. ముఖ్యంగా క్రీడా శాఖ.. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లలో సహకరిస్తోంది. క్రీడల నిర్వహణ, ట్రైనింగ్ క్యాంపులు, సాంకేతిక అంశాలు, షెడ్యూల్ రూపకల్పనతో పాటు పలు అంశాల్లో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధికారులు సహకరిస్తున్నారు. శాప్ కోచ్ లు నిత్యం అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఏర్పాట్లలో పాలుపంచుకుంటున్నారు. అలాగే పురపాలక శాఖ, పోలీస్ శాఖ, ఏపీఎస్ఆర్టీసీ, వైద్య శాఖ బృందాలు కూడా స్పోర్ట్స్ మీట్ కు సహకారం అందిస్తున్నాయి.

మస్కట్ గా కృష్ణ జింక.. ‘ఏక్తా’గా నామకరణం..
గిరిజన విద్యార్థుల్లో ప్రతిభను వెలికితీసే లక్ష్యంతో జరుగుతున్న ఈ జాతీయ క్రీడలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జంతువు కృష్ణ జింకను మస్కట్ గా ఎంపిక చేయడం జరిగింది.భిన్నత్వంలో ఏకత్వం అనే నినాదాన్ని ప్రతిబింభించేలా మస్కట్ కు “ఏక్తా”గా నామకరణం చేయడం జరిగింది.

పాల్గొంటున్న రాష్ట్రాలు
ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఛతీస్ గఢ్, దాద్రానగర్ హవేలీ, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మణిపూర్, మిజోరాం, ఒడిశా, రాజస్థాన్, సిక్కిం, తమిళనాడు, తెలంగాణ, త్రిపుర, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్.

రాష్ట్రాల వారీగా క్రీడాకారుల సంఖ్య

రాష్ట్రం క్రీడాకారుల సంఖ్య
ఆంధ్రప్రదేశ్ 445
అరుణాచల్ ప్రదేశ్ 39
ఛత్తీస్ గఢ్ 259
దాద్రానగర్ హవేలీ 43
గుజరాత్ 375
హిమాచల్ ప్రదేశ్ 163
ఝార్ఖండ్ 162
కర్ణాటక 209
కేరళ 59
మధ్యప్రదేశ్ 399
మహారాష్ట్ర 441
మణిపూర్ 91
మిజోరాం 159
ఒడిశా 212
రాజస్థాన్ 115
సిక్కిం 83
తమిళనాడు 176
తెలంగాణ 485
త్రిపుర 115
ఉత్తర ప్రదేశ్ 80
ఉత్తరాఖండ్ 150
పశ్చిమ బెంగాల్ 68
మొత్తం 4328

వేదికలు:
ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, గుంటూరు
ఆంధ్రా లయోలా కళాశాల, విజయవాడ
ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియం, విజయవాడ
CHKR ఇండోర్ స్టేడియం, పటమట, విజయవాడ
వీఎంసీ జింఖానా స్విమ్మింగ్ పూల్, గాంధీనగర్, విజయవాడ
బ్రహ్మానందరెడ్డి స్టేడియం, గుంటూరు

క్రీడలు-వేదికల వివరాలు

వ్యక్తిగత మరియు సెమీ టీమ్ గేమ్స్
క్ర.సంఖ్య క్రీడ వేదిక మైదానం
1 ఆర్చరీ (విలువిద్య) ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, గుంటూరు ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్స్, ANU
2 అథ్లెటిక్స్ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, గుంటూరు సింథటిక్ ట్రాక్, ANU
3 బ్యాడ్మింటన్ విజయవాడ CHRK ఇండోర్ స్టేడియం, పటమట
4 బాక్సింగ్ ఆంధ్రా లయోలా కళాశాల, విజయవాడ జిమ్ హాల్-1, ఆంధ్రా లయోలా కళాశాల, విజయవాడ
5 చెస్ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, గుంటూరు ఇంజనీరింగ్ కళాశాల భవనం, ANU.
6 జిమ్నాస్టిక్స్ బ్రహ్మానంద రెడ్డి స్టేడియం, గుంటూరు జిమ్నాస్టిక్స్ హాల్, బీఆర్ స్టేడియం, గుంటూరు
7 జూడో ఆంధ్రా లయోలా కళాశాల, విజయవాడ ఆడిటోరియం హాల్-2, ఆంధ్రా లయోలా కళాశాల, గుంటూరు
8 షూటింగ్ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, గుంటూరు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ
9 స్విమ్మింగ్ విజయవాడ VMC జింఖానా స్విమ్మింగ్ పూల్, గాంధీనగర్, విజయవాడ.
10 టేబుల్ టెన్నిస్ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, గుంటూరు స్పోర్ట్స్ కాంప్లెక్స్
11 టెన్నిస్ విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియం
12 తైక్వాండో ఆంధ్రా లయోల కళాశాల, విజయవాడ ఆంధ్రా లయోల కళాశాల, విజయవాడ
13 వెయిట్ లిఫ్టింగ్ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, గుంటూరు స్పోర్ట్స్ కాంప్లెక్స్, ఇండోర్ వెయిట్ లిఫ్టింగ్ హాల్
14 రెజ్లింగ్ ఆంధ్రా లయోలా ఇంజనీరింగ్ కళాశాల, విజయవాడ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్స్, విజయవాడ
15 యోగా ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, గుంటూరు యోగా సెంటర్, ANU.

టీమ్ గేమ్స్
1 బాస్కెట్ బాల్ ఆంధ్రా లయోలా కళాశాల, విజయవాడ మల్టిపుల్ గ్రౌండ్స్-1, విజయవాడ
2 ఫుట్ బాల్ ఆంధ్రా లయోలా కళాశాల, విజయవాడ గ్యాలరీ గ్రౌండ్
3 హ్యాండ్ బాల్ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, గుంటూరు మల్టిపుల్ గ్రౌండ్స్-1, ANU.
4 హాకీ ఆంధ్రా లయోలా కళాశాల, విజయవాడ మల్టిపుల్ హాకీ గ్రౌండ్, విజయవాడ.
5 కబడ్డీ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, గుంటూరు మల్టిపుల్ కాంప్లెక్స్-2, ANU.
6 ఖో-ఖో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, గుంటూరు మల్టిపుల్ కాంప్లెక్స్-1, ANU.
7 వాలీ బాల్ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, గుంటూరు ఫిజికల్ ఎడ్యుకేషన్ గ్రౌండ్స్ ఎదురుగా, ANU.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్

-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *