Breaking News

పన్ను బకాయిలను పూర్తీ స్థాయిలో చెల్లించి, నగరాభివృద్ధికి సహకరించాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
నగరపాలక సంస్థకు ఉన్న పన్ను బకాయిలను పూర్తీ స్థాయిలో చెల్లించి, నగరాభివృద్ధికి సహకరించాలి, నిర్మాణాలకు ముందే ఖాళీ స్థల పన్నులు చెల్లిస్తేనే ఆక్యుపెన్సీ, మార్టిగేజ్ రిలీజ్ చేస్తామని నగర కమిషనర్ కీర్తి చేకూరి ఐఏయస్ స్పష్టం చేశారు. గుంటూరు నగరం సీతానగర్ లోని లక్ష్మీ నందన అపార్ట్మెంట్ యజమాని డి.చిట్టిబాబు నగరపాలక సంస్థకు చెల్లించాల్సిన ఖాళీ స్థల పన్ను రూ.18 లక్షల చెక్ ను శుక్రవారం నగర కమిషనర్ కీర్తి చేకూరి ఐఏయస్ గారికి అందించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో ప్రతి ఖాళీ స్థలానికి పన్ను చెల్లించాలని, చెల్లించకుంటే అందులో నిర్మాణం చేసిన భవనాలకు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ జారి చేయబోమని స్పష్టం చేశారు. బకాయి పన్నులు చెల్లించినట్లు రెవెన్యూ అధికారి సర్టిఫై చేయాలన్నారు. సచివాలయాల వారీగా పన్ను విధింపు, వసూళ్ళపై ప్రత్యేక డ్రైవ్ చేపట్టామన్నారు. ఖాళీ స్థల పన్ను చెల్లించిన లక్ష్మీ నందన అపార్ట్మెంట్ యజమాన్యంకు ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నామన్నారు. కార్యక్రమంలో రెవెన్యూ అధికారి రవి కుమార్ పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *