Breaking News

జగనన్న శాశ్వత భూ హక్కు సర్వే శుక్రవారం నాటికి 25 శాతం పూర్తి చేయాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జగనన్న శాశ్వత భూ హక్కు సర్వే శుక్రవారం నాటికి 25 శాతం పూర్తి చేయాలని, వడ్డీ లేకుండా ప్రస్తుత అర్ధ సంవత్సరం ఆస్తి పన్ను చెల్లింపుకు ఈ నెల 31 వరకు గడువు ఉందని, వసూళ్ళను వేగవంతం చేయాలని నగర కమిషనర్ కీర్తి చేకూరి ఐఏయస్  స్పష్టం చేశారు. శుక్రవారం వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో వార్డ్ సచివాలయ పరిపాలన, ప్లానింగ్, ఎడ్యుకేషన్ కార్యదర్శులతో నగరంలో జరుగుతున్న జగనన్న శాశ్వత భూ హక్కు సర్వే పురోగతి, ఆస్తి పన్ను వసూళ్ళ వేగవంతం, రోడ్ విస్తరణ పనుల వేగవంతం, మీడియా డివైజ్ ఫీజుల వసూళ్ళు, ప్రణాళిక విభాగానికి సంబధించి సేవల ఆర్జీల పరిష్కారం పై సమీక్షా సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా కమిషనర్  మాట్లాడుతూ నగరంలో జగనన్న శాశ్వత భూ హక్కు సర్వే సచివాలయాల వారిగా తక్కువ శాతం చేసిన కార్యదర్శులను నేరుగా కారణాలు అడిగి, ఎక్కువ శాతం సాధించిన కార్యదర్శును అభినందించారు. పరిపాలన, ప్లానింగ్, వి.ఆర్.ఓ.లు బృంద స్పూర్తితో పని చేసి, వచ్చే శుక్రవారం నాటికి తప్పనిసరిగా ప్రతి సచివాలయం నుండి 25 శాతం ఇళ్ల యూనిట్స్ పూర్తి చేయాలని స్పష్టం చేశారు. కార్యదర్శులకు అవసరమైన టౌన్ సర్వే రికార్డ్స్, సచివాలయ ప్లాన్లు సర్వేయర్లు, ట్రేసర్ అందించేందుకు భాద్యత వహించాలన్నారు. సర్వే వివరాలు సంబందిత వార్డ్ ప్లానింగ్ కార్యదర్శే అందించి, ఇతర కార్యదర్శులతో, సర్వేయర్లతో సమన్వయం చేసుకోవాలన్నారు.
అనంతరం రెవెన్యూ వసూళ్లపై సమీక్షించి డిశంబర్ నెల ముగుస్తున్నప్పటికి వసూళ్లు ఆశించిన స్థాయిలో పురోగతి లేక పోవడం పై అసహనం వ్యక్తం చేసి, వసూళ్ళ పై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. మొండి బకాయిదార్లకు ఇప్పటికే రెడ్ నోటీసుల జారీకి ఆదేశాలు ఇచ్చామని, ఆర్.ఐ.ల వారీగా ఇప్పటికి ఎన్ని నోటీసులు ఇచ్చింది సమీక్షించాలని అదనపు కమిషనర్ ను ఆదేశించారు. తక్కువ శాతం రెవెన్యూ వసూళ్లు చేసిన కార్యదర్శుల వారీగా సమీక్షించి, ఈ నెల 31 వరకు ప్రస్తుత అర్ధ సంవత్సరం ఆస్తి పన్ను పై వడ్డీ లేనందున నగరపాలక సంస్థ పరిపాలన కార్యదర్శులకు అందించిన స్లిప్ ల ద్వారా ప్రతి బకాయిదారులకు అందించి, పన్ను వసూళ్లు వేగవంతం చేయాలని ఆదేశించారు. అండర్, అన్ అసెస్మెంట్ ల వివరాలు అడిగి తెలుసుకొని, సర్టిఫికేట్ అందించేందుకు ఇప్పడితే నిర్దేశిత గడువు ముగిసిందని, నిబందనలకు విరుద్దంగా అండర్ అసెస్మెంట్ అర్జీలు దాఖలు చేయుటలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన 92, 97 వార్డ్ సచివాలయ పరిపాలన కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని అదనపు కమిషనర్ ని ఆదేశించారు. అధిక మొత్తంలో పన్ను బకాయి ఉన్న నాజ్ సెంటర్, కొల్లి శారద మార్కెట్ కాంప్లెక్స్ లు మరియు ఖాళీ స్థల పన్ను వసూళ్లు వేగవంతం చేయాలని, తదుపరి సమావేశం కాంప్లెక్స్ షాప్స్ పన్ను బకాయిల పై ప్రత్యేక సమీక్ష చేస్తామన్నారు. నీటి పన్ను వసూళ్ళ వివరాలు అడిగి తెల్సుకొని, నగరపాలక సంస్థ మెరుగైన, స్వచ్చమైన నీటిని సరఫరా చేస్తుందని, రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా నెలకు కేవలం రూ.80 మాత్రమే చేల్లిస్తున్నారని, ప్రజలకు అవగాహన కల్గించి, పన్ను వసూళ్లు నూరు శాతం చేయాలన్నారు. సచివాలయ కార్యదర్శులు ఉదయం క్షేత్ర స్థాయిలో పర్యటించి, మధ్యానం 3 నుండి 5 గంటల వరకు స్పందనకు హాజరు కావాలన్నారు. సమిష్టి కృషితో నిర్దేశిత లక్ష్యాలను అధికమించడానికి ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
ప్రణాళిక విభాగం పై సమీక్షించి, పలకలూరు రోడ్, కుగ్లర్ హాస్పిటల్ రోడ్, డొంక రోడ్, ఏటి అగ్రహారం విస్తరణలో డ్రైన్ నిర్మాణాలకు అడ్డుగా ఉన్న వాటిని తొలగించాలని, అందుకు అవసరమయ్యే టి.డి.ఆర్. బాండ్లు, నష్ట పరిహారం పై ఫైల్ సిద్దం చేయాలని సిటి ప్లానర్ ని ఆదేశించారు.రెడ్డిపాలెం రోడ్ ను ఆర్.డి.పి. ప్రకారం శుక్రవారం నాటికీ పూర్తి చేయాలన్నారు. మొండి గేటు దగ్గర అవుట్ ఫాల్ డ్రైన్ క్రాసింగ్ పై డి.టి.సి.పి.లో పెండింగ్ లో ఉన్న ఫైల్ ను డి.సి.పి. కోటయ్య ప్రత్యేక దృష్టి సారించి, వచ్చే శుక్రవారం నాటికి ప్రభుత్వ అనుమతికి పంపేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. టి.డి.ఆర్.ల ఆన్ లైన్ ఈ నెల 31లోపు పూర్తి చేయాలని, ప్రతి టి.డి.ఆర్. డి.సి.పి., సిటి ప్లానర్ లు ప్రత్యక్ష పరిశీలన చేయాలన్నారు. డొంక రోడ్, పలకలూరు రోడ్ విస్తరణలో పూర్తిగా గృహాలు కోల్పోయిన వారి అసెస్మెంట్లను నగరపాలక సంస్థ రెవెన్యూ రికార్డ్ నుండి తొలగించేందుకు కౌన్సిల్ ప్రియాంబుల్ సిద్దం చేయాలని ఆదేశించారు. మీడియా డివైజ్ ఫీజుల బకాయి పై డి.సి.పి.ని వివరాలు అడిగి తెలుసుకొని, బృందాల వారీగా గురువారం వసూళ్లు చేసిన రూ.1 కోటిని శనివారం జమ చేయించాలని, జమ వివరాలను తమకు అందించాలని మేనేజర్ ని ఆదేశించారు. నగరంలో ట్రాఫిక్ జంక్షన్లలో ఫీజులు చెల్లించకుండా ఏర్పాటు చేసిన 44 కెసిపి సిమెంట్ ప్రకటనల బోర్డ్ లకు వినియోగం నాటి నుండి డిమాండ్ విధించి, వసూళ్లు చేయాలన్నారు. చెల్లించని బోర్డ్ లను వెంటనే తొలగించాలని కార్యదర్శులను ఆదేశించారు. అదే విధంగా బోర్డ్ లకు క్యూ ఆర్ కోడ్ అమలు పై మొదటి విడతగా ఎటువంటి బకాయిలు లేని 5 ఏజన్సీలకు వచ్చే వారం నాటికి చర్చించి అమలు చేయాలని ఆదేశించారు. అలాగే ప్రణాళిక విభాగంలో దరఖాస్తు చేసుకొని గడువు దాటిన భవన నిర్మాణ ప్లాన్ అర్జీలు, ఐపిఎల్పి, ఎల్.ఆర్.ఎస్., ఆక్యుపెన్సీ ఆర్జీలను కార్యదర్శుల వారిగా సమీక్షించి, వేగవంతం చేయాలని ఆదేశించారు. ఆక్యుపెన్సీ మంజూరు సమయం నాటికే మార్ట్ గేజ్ కూడా విడుదల చేయాలన్నారు. కౌన్సిల్ ఆమోదించిన నగరపాలక సంస్థ పెట్రోల్ బంక్ అనుమతి ఫైల్ ను ప్రభుత్వానికి వచ్చే వారంలోపు పంపేలా పట్టణ ప్రణాళిక విభాగ సూపరిండెంట్ ని ఆదేశించారు.
సమావేశంలో అదనపు కమిషనర్ పి.రోజా, డిప్యూటీ కమిషనర్ బి.శ్రీనివాసరావు, సిటి ప్లానర్ మూర్తి, డిప్యూటీ సిటి ప్లానర్ కోటయ్య, ఏ.సి.పి.లు, ఆర్.ఓ.లు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్

-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *