రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో ఖరీఫ్ పంటకు ముందస్తుగా గోదావరి జలాలు కాలువులకు విడుదల చేసినందున ఖరీఫ్ పంటను కాపాడు కొన్నామని జిల్లా కలెక్టర్ డా. కే మాధవీలత అన్నారు. శుక్రవారం జిల్లా స్థాయి వ్యవసాయ సలహా మండలి సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ జిల్లాలో ఖరీఫ్ సాగు ముందుగా ప్రారంభించడం వలన తుఫాను వరదలు నుండి కాపాడుకున్నా మన్నారు. ఖరీఫ్ లో రైతు పండించిన ధాన్యాని జిల్లాలో మిల్లర్ల ప్రమేయం లేకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన నూతన విధానం తో రైతులు నుండి ధాన్యాన్ని కళ్ళల్లోనే సేకరించి రైతుకు గిట్టుబాటు ధరను అందజేసి 21 రోజుల్లోనే వారి ఖాతాల్లో సొమ్ము జమ చేయడం జరిగిందన్నారు. ఇదే తరహాలో రబీ సీజన్లో కుడా ఈ క్రాఫ్ పంట నమోదు కార్యక్రమాన్ని పక్కాగా నిర్వహించాలాన్నారు. ఖరీఫ్ లో వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు సమన్వ- యంతో పనిచేయడం వలన రైతులు పంట నష్టపోకుండా చూడగలిగామని కలెక్టర్ అధికారులు అభినందించారు. జిల్లా వ్యవసాయ సలహా మండల సమావేశం చైర్మన్ బూరుగుపల్లి సుబ్బారావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ రైతులను ఆర్థికంగా ఆదుకుంటూ వారికి భరోసా కల్పిస్తుంది అన్నారు. ఆర్.బికేలు ద్వారా వారి గ్రామాల్లోనే నాణ్యమైన విత్తనాలు ఎరువులు, అందిస్తూ రైతుకు చేయూతనిస్తుందన్నారు. అదేవిధంగా సిహెచ్ సి గ్రూపులకి వైయస్సార్ యంత్ర సేవ పధకం కింద పరికరాల సరఫరా చేయడం జరిగిందన్నారు. జిల్లా వ్యవసాయశాఖాధికారి ఎస్. మాధవరావు మాట్లాడుతూ జిల్లాలోని ప్రతి మండలంలో మండల స్థాయి వ్యవసాయ సలహా మండల సమావేశాలు ఏర్పాటు చేసి రైతులకు వరి సాగు పద్ధతులు పై అవగాహన కల్పిస్తున్నామన్నారు. సమావేశంలో డిసిసిబి చైర్మన్ ఆకుల వీర్రాజు, జిల్లా ఉద్యాన అధికారి వి.రాధాకృష్ణ, వ్యవసాయ శాఖ డిప్యూటీ డైరెక్టర్ బోసు బాబు, ఏపీఎంఐపి పిడి ఎస్ రామ్మోహన్రావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Tags rajamendri
Check Also
గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్
-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …