-ప్రజారోగ్య భద్రతే లక్ష్యంగా ప్యామిలీ ఫిజీషియన్ కార్యక్రమం ద్వారా ఇంటింటీ వైద్య సేవలు..
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
మాతృ మరణాలు సంభవించకుండా వైద్యులు, వైద్య సిబ్బంది ప్రత్యేక దృష్టి సారించి గర్భిణీ స్త్రీలు ప్రసవించే వరకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టరు డా. కె. మాధవీలత వైద్యాధికారులకు సూచించారు. శుక్రవారం రాజమహేంద్రవరం రూరల్ మండలం కాతేరు ప్రాధమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టరు మాధవీలత సందర్శించి పిహెచ్ సీ పరిధిలో గర్భీణీ స్త్రీలకు అందిస్తున్న వైద్య పరీక్ష గురించి ఆరా తీసారు. ఈ సందర్భంగా కలెక్టరు మాట్లాడుతూ మహిళలు గర్భవతులైనప్పటి నుంచి ప్రసవించే వరకు వారి ఆరోగ్య భద్రతకు ఎటివంటి ఇబ్బందులు లేకుండా ఆయా పిహెచ్ సీ వైద్య సిబ్బంది వారి ఇంటి వద్దకే వెళ్లి వైద్య సేవలందించాలన్నారు. గర్భవతులై ఆరోగ్యపరమైన వత్తిడికి (high risk) గురవుతున్న వారిని ముందుగానే గుర్తించి జాబితాలను సిద్దం చేయాలన్నారు. అధిక వత్తిడి గల గర్భిణీ స్త్రీలను డెలివరీ తేదీకి వారం రోజులు ముందుగానే ఆయా పిహెచ్ సీకి అనుసందానం గా ఉన్న సామాజిక ఆరోగ్య కేంద్రం, జిల్లా ఆస్పత్రుల్లో చేర్చే విధంగాం ముందస్తు ప్రణాళిక సిద్దం చేయాలని కలెక్టరు వైద్యాధికారులను ఆదేశించారు. ఈ సందర్బంగా కలెక్టరు మాధవీలత వైద్య పరీక్షలు నిమిత్తం ఆస్పత్రికి వచ్చిన మహిళలను వారి ఆరోగ్య పరిస్థితులు గురించి తెలుసుకున్నారు. ప్రజారోగ్య భద్రత కొరకు రాష్ట్ర ప్రభుత్వం ప్యామిలీ ఫిజీషియన్ కార్యక్రమం ప్రవేశపెట్టిందన్నారు. క్షేత్రస్థాయిలో వైద్యాధికారులు, సిబ్బంది ఇంటింటికీ వెళ్తూ వైద్య పరమైన సూచనలు అందిజేస్తున్నారన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. కె. వెంకటేశ్వరరావు మాట్లాడుతూ జిల్లాలో గర్ఫణీ స్త్రీలకు ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఎదురైతే వెంటనే జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి కార్యాలయంలో గల కాల్ సెంటర్ నెంబరు 7780702687 పోన్ చేయాలన్నారు. కార్యక్రమంలో డా. రాజీవ్, ఇతర వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News