Breaking News

46 సం॥ తర్వాత పూర్వ విద్యార్దుల ఆత్మీయ సమ్మేళం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
46 సంవత్సరాల తరువాత 1976 సం॥ బ్యాచ్‌ సత్యనారాయణపురం, రైల్వే మిక్సెడ్‌ హైస్కూల్‌, తెలుగు మీడియం, 10వ తరగతి పూర్వ విద్యార్థుల అపూర్వ కలయిక జరిగింది. ఎస్‌.మల్లిక్‌, సుకుమార్‌, టి.వేణుగోపాల్‌, ఎం.వి.శ్రీనివాస్‌, ఎన్‌.సి.హెచ్‌.రంగనాథ్‌ ఆధ్వర్యంలో ఆదివారం విజయవాడ, గాంధీనగర్‌లోని ఐలాపురం హోటల్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరుకావడానికి అమెరికా, కెనడా, ఆస్ట్రేలియాలతో పాటు వివిధ ఇతర దేశాలలోను, వివిధ ప్రాంతాలలో స్థిరపడిన విద్యార్థులు అందరూ కుటుంబాలతో కలిసి 46 సంవత్సరాల తరువాత కలిసి గత స్మృతులను తలచుకొని, ఒకరికొకరు క్షేమ సమాచారాలు తెలుసుకుని ఆత్మీయ సమ్మేళనంలో ఆనందంగా గడిపారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్దులు, వారి కుటుంబ సభ్యులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *