Breaking News

సమ సమాజమే ద్యేయంగా “ప్రజా సేవ అంకిత్ పార్టీ”

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కుల మతాలకు, రాజకీయాలకు అతీతముగా ప్రతీ కుటుంబానికి కనీస వసతులు కల్పించాలని, SC, BC, OC సామాజిక వర్గాల వారిని అదే వరుసలో ముఖ్యమంత్రులను చేయడం ద్వారా వారలకు రాజ్యాధికారం కల్పించాలనే ఉద్దేశ్యం తో స్వార్ధ రహితం గా ప్రజా సేవ అంకిత్ పార్టీ ఏర్పాటు చేయడమైనదని , పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు పి.వి.ఎస్.ఎస్.ఎస్ మూర్తి తెలిపారు. ఆదివారం విజయవాడ ప్రెస్ క్లబ్ నందు పార్టీ నిర్వహించిన పార్టీ సభ్యుల సమావేశం జోనల్ వారీగా పార్టీ సమన్వయ కర్తలను ఏర్పాటు చేసి వారికి నియామక పత్రములు అందచేయడం జరిగిందని ప్రెసిడెంట్ మూర్తి తెలిపారు. పార్టీ అధికారం లోనికి వచ్చిన మొదటి సంవత్సరమే, ఉద్యోగం లేని ప్రతీ కుటుంబానికి ఒక ఉద్యోగం యిచ్చుట ద్వారా ప్రజలకు కనీస అవసరాలు అయిన తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట కల్పించాలని, అధికారం లోకి వచ్చిన మూడు సంవత్సరాలలో ఇల్లు లేని ప్రతీ కుటుంబానికి డబల్ బెడ్ రూమ్ గృహము కట్టించి యిచ్చుట ద్వారా ప్రతీ కుటుంబానికి గూడు ఏర్పాటు చేయాలని, రైతును మునుపటి లా రైతే రాజు అనిపించాలని, ఉచిత విద్య, వైద్యం, కల్పించాలనే ముఖ్య ఆశయాలతో పార్టీ ఏర్పాటు చేయుట జరిగిందని మూర్తి తెలిపారు. యీ సందర్బంగా పార్టీ మానిపిస్టో విడుదల చేయుట జరిగింది.బి.హెచ్. సుమిత్రానందన్ వారిని పూర్వపు పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి జిల్లాల సమన్వయ కర్తగాను,డి.నరేంద్ర సాయి, గుంటూరు వారిని కృష్ణ, గుంటూరు, ప్రకాశం జిల్లాల సమన్వయ కర్తగాను, ఎం.భరద్వాజ అనంతపురం వారిని రాయలసీమ జిల్లాల సమన్వయ కర్త గా, షేక్ సుభాని గుంటూరు వారిని రాష్ట్ర పార్టీ మైనారిటీ విభాగం ప్రెసిడెంట్ గాను, కె బులెయ్య మైలవరము నియోజకవర్గ పార్టీ వైస్ ప్రెసిడెంట్ గా, యు.రామకృష్ణ వారిని విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గ ఇంచార్జి గాను నియమించి వారికి నియామక పత్రాలు అందచేయడం జరిగింది. ఈ సందర్బంగా పార్టీ ఆశయాలు అమలు జరుపుట భాగంలో ప్రజాసేవ అంకిత్ పార్టీ రాష్ట్రము లో ప్రతీ గ్రామములో ప్రజల స్థితి గతులు, వారి సమస్యలు తెలుసు కోవడానికి సర్వే కార్యక్రమం నిర్వహించాలని పార్టీ తీర్మానం చేయుట జరిగిందని మూర్తి తెలిపారు. పార్టీ అభిమాని, పార్టీ శ్రేయోభిలాషి ఫణి కుమార్ వారి అమూల్యమైన సలహాలు అందచేశారు. ఈ కార్యక్రమం లో ప్రజా సేవ అంకిత్ పార్టీ వివిధ జిల్లాల నుండి వచ్చిన సభ్యులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : కొమొరిన్ నుండి కర్ణాటక, రాయలసీమ, తమిళనాడు మీదుగా మధ్యప్రదేశ్ వరకు సముద్ర మట్టానికి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *