Breaking News

ప్రతిపక్షాల కుట్రలను తిప్పికొట్టాలి : దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
శుక్రవారం నాడు 3 మరియు 17 డివిజన్లో జరిగిన కార్యకర్తల సమావేశానికి ముఖ్యఅతిథిగా తూర్పు నియోజకవర్గ వైఎస్ఆర్సిపి ఇన్చార్జ్ దేవినేని అవినాష్ పాల్గొన్నారు. అవినాష్ మాట్లాడుతూ వైఎస్ఆర్సిపి పార్టీ రధ సారధులు కార్యకర్తలే అని కొనియాడారు. ఏ పార్టీకైనా కార్యకర్తలు ఉంటారు కానీ వైసీపీ కి ఉన్న కార్యకర్తలు దేశంలోనే ఏ ఇతర రాజకీయ పార్టీకి లేనంత విధంగా ఎంతో నిస్వరద్ధంగా అహ్రాన్నిసాలు పార్టీ పటిష్ట కోసం పాటుపడుతున్న మీలాంటి వారు దొరకడం మా అదృష్టం అని అవినాష్ అన్నారు. ప్రతి కార్యకర్త కూడా రానున్న కాలంలో పార్టీ వారికీ సముచిత స్థానం కలిపిస్తుంది అని అవినాష్ అన్నారు. వైస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక ఇచ్చిన మాట ప్రకారం ఏ పార్టీ చేయలేని విధంగా అభిరుద్ది కార్యక్రమాలు, అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసిన ఘనత మన వైస్సార్సీపీ పార్టీ అనే విషయాన్ని ప్రజలకు వివరించాల్సిన భాద్యత ప్రతి కార్యకర్తకు ఉంది అని అవినాష్ అన్నారు. మన రాణిగారి తోట, తారకరామా నగర్ ప్రాంత వాసులకు తెలుసు వర్షం వస్తే ఇక్కడ ఎలా ఉండేవారో. ఇక్కడ ప్రజల బాధలు చూసి చలించి పోయి ఆసెంబ్లీ సాక్షి గా మన నాయకుడు ఇచ్చిన మాట ప్రకారం రిటైనింగ్ వాల్ నిర్మించి ప్రజలు కష్టాలు తీర్చిన మన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారికి మనంత అండగా ఉండాలి అని అవినాష్ అన్నారు. గత ప్రభుత్వంలో జన్మభూమి కమిటీల పేరుతొ ప్రతి దానికి చేయ చాపి, ఇప్పుడు మన ప్రభుత్వం ప్రతి పేదవాడికి సొంత ఇల్లు ఉండాలని ఉచితంగా ఇళ్ల స్థలం ఇస్తుంటే దాని కూడా ఆపడానికి తెలుగుదేశం వారు కోర్టులో కేసులు వేసి పేద వాడి సొంత ఇంటికలను దూరం చేయాలనీ చూస్తున్న విషయం ప్రతి కార్యకర్త ఇక్కడ ఉన్న లబ్ది దారులకు వివరించాలి అని అలాగే మూడో డివిజన్ లో కనీసం ఒక్క అభిరుద్ది కార్యక్రం కూడా చేయలేదు అని, ఇక్కడ జరిగిన ప్రతి అభిరుద్ది కార్యక్రమం మన వైస్సార్సీపీ అధికారంలోకి వచ్చాకే జరిగింది అనే విషయం ప్రతి ఒక్కరికి వివరించాలి అని అవినాష్ అన్నారు. రానున్న కాలంలో ఎన్నికలు సమీపిస్తున్న ఈ సమయంలో ప్రతిపక్ష పార్టీలు మన నాయకుడు జగన్ మోహన్ రెడ్డి గారి మీద గాని మన పార్టీ మీద గాని చేసే అసత్య ప్రచారాలు తిప్పికొట్టే విధంగా మన కార్యకర్తలంతా స్థానిక ప్రజానీకానికి మనం చేసిన సంక్షేమం గురించి అభివృద్ధి గురించి ఖచ్చితంగా వివరించాల్సిన అవసరం ఉంది అని అవినాష్ అన్నారు. కార్యకర్తలంతా నిత్యం ప్రజల్లో ఉండి మనం చేసిన మంచిని ఒకటికి పది సార్లు ప్రజలందరికీ అర్థమయ్యే విధంగా వారికి వివరించాలని అవినాష్ చెప్పారు.మా నమ్మకం నువ్వే జగన్ కార్యక్రమాన్ని విజయ వంతం చేసిన క్లస్టర్ ఇన్ చార్గ్స్ కి, కన్వీనర్లకు, గృహ సారధులకు అభినందనలు తెలియజేసారు వీరికి పార్టీలో ప్రత్యేక గుర్తింపు ఉంటుంది అని అవినాష్ అన్నారు. రానున్న కాలంలో అందరూ కూడా భేదాభిప్రాయాలు లేకుండా కలిసికట్టుగా పార్టీ పటిష్ఠతకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సీనియర్ నాయకులు కడియాల బుచ్చిబాబు,3వ డివిజన్ కార్పొరేటర్ భీమిశెట్టి ప్రవళిక, 17 డివిజన్ కార్పొరేటర్ తంగిరాల రామిరెడ్డి, కో ఆప్షన్ మెంబర్ ముసునూరు సుబ్బారావు, నాగవంశీ కార్పొరేషన్ డైరెక్టర్ యరన్నేటి సుజాత అధ్యక్షులు కాశి, కావటి దామోదర్, మొహిద్దీన్, సాయి కృష్ణ రెడ్డి, ఉదయ్, చింత బుచ్చి బాబు, ఎన్ స్ రాజు, భీమిశెట్టి నాని, కాలనీ ప్రెసిడెంట్లు, బాల రాజు, చిన్నారి, జయ లక్ష్మి, గీత, రమణ, కమలమ్మ, దుర్గమ్మ, భూలక్ష్మి, యాకోబ్మ్, అయ్యప్ప రెడ్డి, తిరుపతి రెడ్డి మరియు వై.యస్.ఆర్.సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

నారావారిపల్లె గ్రామపంచాయతీ అభివృద్ధికి దిశా నిర్దేశం

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : చంద్రగిరి మండలం నారావారిపల్లి గ్రామపంచాయతీ స్వర్ణ నారావారిపల్లె విజన్ లో భాగంగా ఆదర్శవంతంగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *