-కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ గారు ఐ.ఏ.ఎస్.
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
స్వరాజ్య మైదానంలో ఎంతో అద్భుతంగా నిర్మాణం జరుగుతున్న అంబేద్కర్ విగ్రహ నిర్మాణ పనులను మంగళవారం క్షేత్ర స్థాయిలో పరిశీలించిన కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్.అదే విధముగా అంబేద్కర్ స్మృతివనం ఆవరణలో గల వర్షపునీటిని గుంటలను పరిశీలించి యుద్దప్రాతిపదిక చర్యలు చేపట్టి వర్షపునీటిని డ్రెయిన్ లకు మళ్ళించాలని ఆదేశించారు. అవసరమైన చోట్ల మోటార్లు ఏర్పాటు చేసి ఎక్కడ వర్షపు నీరు నిల్వలు లేకుండా చూడాలని అధికారులకు సూచించారు.ఈ సందర్భములో జరుగుచున్న నిర్మాణ పనులను పరిశీలించి నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ పనులు నిర్వహించాలని క్వాలిటి కంట్రోల్ అధికారులను ఆదేశించారు. కారిడార్ మొత్తంలో గ్రానైట్ ఫుట్ ఫాత్, ల్యాండ్ స్కెఫ్,కాంపౌండ్ వాల్ నిర్మాణాన్ని పరిశీలించిన కమిషనర్ అన్ని భాగాలు కలిపి చాలా జాగ్రత్తగా విగ్రహ నిర్మాణం చేయాలని ఆదేశించారు.అద్భుతమైన ప్రాజెక్ట్ అని.. ఎక్కడ పొరపాట్లు లేకుండా అంబేద్కర్ విగ్రహ నిర్మాణం జరగాలని సూచించారు. ప్రధాన విగ్రహం తో పాటు మిగిలిన పనులు సైతం సమయంలోపు పూర్తి చెయ్యాలని కాంట్రాక్టర్లు కు ఆదేశించారు.అంబేద్కర్ స్మృతివనం పనులు పరిశీలించిన వారిలో, విజయవాడ నగర మున్సిపల్ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్ గారు, క్వాలిటీ కంట్రోల్ అధికారులు, ఎపీ.ఐ.ఐ.సీ అధికారులు మరియు కే.పి.సి. ప్రాజెక్ట్ కాంట్రాక్టర్లు పాల్గొన్నారువిజయవాడ నగరపాలక సంస్థ
Tags vijayawda
Check Also
నారావారిపల్లె గ్రామపంచాయతీ అభివృద్ధికి దిశా నిర్దేశం
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : చంద్రగిరి మండలం నారావారిపల్లి గ్రామపంచాయతీ స్వర్ణ నారావారిపల్లె విజన్ లో భాగంగా ఆదర్శవంతంగా …