విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థ కమీషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆధ్వర్యంలో మంగళవారం విజయవాడ నగరము లో స్వయం సహాయక సంఘ సభ్యులచే తయారు చేయబడిన ఉత్పత్తులు ప్రదర్శన మరియు అమ్మకాలు జరిపించుటకు మెప్మా వారిచే హ్యాండీ క్రాఫ్ట్ షాప్ ను రాజీవ్ గాంధీ పార్క్ నందు ప్రారంభించడం జరిగింది. ఈ షాప్ నందు కొండపల్లి బొమ్మలు, సాప్ట్ టాయ్స్, సేంద్రియ ఎరువులు, వేదాల వారి ఆర్గానిక్ ప్రొడక్ట్స్ మరియు ఇతర ఉత్పత్తులు ప్రదర్శన మరియు అమ్మకాలు జరుగును. కావున విజయవాడ నగర ప్రజలు రాజీవ్ గాంధీ పార్క్ నందు గల హ్యాండీక్రాఫ్ట్ షాప్ ను సందర్శించి స్వయం సహాయక సంఘాలకు ప్రోత్సాహం అందించవలసిన గా కోరడం అయినది.
Tags vijayawda
Check Also
నారావారిపల్లె గ్రామపంచాయతీ అభివృద్ధికి దిశా నిర్దేశం
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : చంద్రగిరి మండలం నారావారిపల్లి గ్రామపంచాయతీ స్వర్ణ నారావారిపల్లె విజన్ లో భాగంగా ఆదర్శవంతంగా …