-ఫుట్‌పాత్‌లపై వ్యాపారాన్ని అరికట్టండి..
-జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు.
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఫుట్‌పాత్‌లను ఆక్రమించుకుని చిరువ్యాపారం చేసే పేదలకు ప్రత్యామ్నాయ స్థలాన్ని కేటాయించి పాదచారులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు సంబంధిత అధికారులకు సూచించారు.విజయవాడ నగరాభివృద్ధిలో భాగంగా పుట్‌పాత్‌ల సుందరీకరణ పై శుక్రవారం జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు సంబంధిత అధికారులకు వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నగరంలో పాదచారులకు మరింత సౌకర్యం కల్పించడంతోపాటు ట్రాఫిక్ ఇబ్బందులను తొలగించేందుకు ఫుట్‌పాత్‌లను ఆధునీకరణ చేసేందుకు చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. నగరపరిధిలో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఇప్పటికే ఫుట్‌పాత్‌ల ఆధునీకరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. నగర శివారు ప్రాంతంలో కొందరు చిరువ్యాపారులు ఫుట్‌పాత్‌పై వ్యాపారం నిర్వహిస్తు పాదచారులకు ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. ముఖ్యంగా ఫుట్‌పాత్‌లపై చేపలు, రొయ్యలు వంటి ఉత్పత్తులను విక్రయించి వాటిని ఫుట్‌పాత్‌లపై శుభ్రపరచడం వలన దుర్గంథం వ్యాప్తిం చేందడంతోపాటు నీటి వాడకం వలన వాహన దారులకు కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. పంచాయతీ, రెవెన్యూ, సంక్షేమ అధికారులు ఫుట్‌పాత్‌లను అక్రమించుకుని చిరువ్యాపారాలు నిర్వహిస్తున్న వారిని గుర్తించి అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.గొల్లపూడి సమీపంలోని వై జంక్షన్ వద్ద గిరిజన కుటుంబానికి చెందిన వారు ఎక్కువగా ఫుట్‌పాత్‌లపై వ్యాపారం నిర్వహిస్తు ఉండడం వలన ఎదురయ్యే ఇబ్బందులపై స్థానిక ప్రజల నుండి ఫిర్యాధులు అందుతున్నాయన్నారు. ఫుట్‌పాత్‌లపై చిరువ్యాపారం నిర్వహించే పేదలకు తాత్కాలిక ప్రతిపాదికిన అదే ప్రాంతంలో ప్రత్యామ్నాయ స్థలాలలను చూపించి వ్యాపారాలను నిర్వహించేకునేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డిల్లీరావు అధికారులను ఆదేశించారు.
కాన్ఫరెన్స్‌లో గిరిజన సంక్షేమ అధికారి యం రుక్మాంగద్య, డిపివో జె. సునీత, విజయవాడ రూరల్ ఇన్‌చార్జీ యంపిడివో శేషగిరిరావు, తహాశీల్థార్ జాహ్నవి ఉన్నారు.
Tags vijayawda
Check Also
ప్రజలు గడ్డి పెట్టినా… బుద్ధి మార్చుకోని వైసీపీ నేతలు
-మనోభావాలు దెబ్బతినే విధంగా పండుగలపైనా ప్రేలాపనలు -రూ.850 కోట్లతో రోడ్లు బాగు చేసినా… వక్రబుద్ధితో విమర్శలు -రూ. 6,700 కోట్లు …