-పూర్వ వైభవం తీసుకువచ్చేలా చర్యలు కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గాంధీజీ పర్వతం పై రూ.80 లక్షలతో పునరుద్ధరికరణ జరిగినటువంటి నక్షత్ర ప్రదర్శన శాలను నేడు నగర కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్ క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. అభివృద్ధి చేసినటువంటి ప్లానిటోరియం లోపల సీట్లను మరియు నక్షత్రాలు, గ్రహాలు మరియు ఇతర ఖగోళ వస్తువుల చిత్రాలను ప్రదర్శించే స్క్రీన్ ను పరిశీలించి వివరాలు అడిగితెలుసుకొని అధికారులకు పలు సూచనలు చేసారు. ఈ సందర్బంలో కమిషనర్ మాట్లాడుతూ గాంధీజీ పర్వతం ఒక టూరిస్ట్ ప్రదేశముగా ప్రజలకు అందుబాటులోనికి తీసుకురావాలనే లక్ష్యంగా విజయవాడ నగరపాలక సంస్థ ప్రత్యేక శ్రద్ద తీసుకోని దీనిని అభివృద్ధి పరుస్తుందని పేర్కొన్నారు. ఎంతో చరిత్ర కలిగిన ఈ గాంధీ కొండ చుట్టూ తిరిగే ట్రైన్ గ్రంధాలయo, లైటింగ్ సౌండ్ సిస్టం, పిల్లలకు ఆకర్షనియంగా ఉండేలా అట పరికరాల ఏర్పాటు వంటి అంశాలపై దృష్టి సారించి వాటిలో నేడు కొన్ని ప్రజలకు అందుబాటులోనికి తీసుకురావటం జరుగుతుందని వివరించారు. ఈ నక్షత్ర ప్రదర్శన శాలను వారం రోజులలో ప్రారంభించాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. ఈ పర్యటనలో అదనపు కమిషనర్ (ప్రాజెక్ట్స్) కె.వి సత్యవతి, (డిప్యూటీ సిటి ప్లానర్ ప్లానింగ్) జుబిన్ శిరన్ రాయ్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏ.ఎస్.ఎన్ ప్రసాద్, ఏ.డి.హెచ్ శ్రీనివాసు, శానిటరీ ఇన్స్ పెక్టర్లు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.