విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆపిల్ హాస్పిటల్ ప్రథమ వార్షికోత్సవం విజయవాడ నక్కల్‌రోడ్‌లో ఘనంగా నిర్వహించారు. హాస్పిటల్‌లో శనివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు ప్రముఖ యూరాలజిస్ట్ అండ్ లాప్రోస్కోపీ సర్జన్ డాక్టర్ డి.కిరణ్‌కుమార్ మీడియాతో మాట్లాడుతూ ఈ సంవత్సర కాలంలో ఆపిల్ ఆస్పిటల్ నుండి 7,000 మందికి వైద్య సదుపాయం అందించామని, వెయ్యిమంది ఇన్ పేషెంట్‌లుగా చేరగా అందులో 750 మందికి సర్జరీలు చేయడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని తెలిపారు. హాస్పిటల్లో అభివృద్ధికి కృషిచేసిన తోటి సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్ అయినటువంటి డాక్టర్ కె.వి.గురువర్ధన్ కుమార్, సీనియర్ గైనకాలజిస్ట్ డాక్టర్ ఐ.హెచ్.ఎస్.కాత్యాయిని, సీనియర్ డెర్మటాలజిస్ట్ డాక్టర్ ఎం.జ్యోతి మరియు హాస్పిటల్స్ సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఆపిల్ హాస్పిటల్స్ పేషెంట్స్ మరియు వారి బంధువులకు అవసరమైన అయిన ఓపిడి, డయాగ్నోస్టిక్ సేవలపై 50 శాతం తగ్గింపు మరియు శస్త్ర చికిత్సలపై ప్రత్యేక తగ్గింపు ఈనెల 24వ తేదీ నుండి 30వ తేదీవరకు అందిస్తున్నామన్నారు. మేనేజింగ్ డైరెక్టర్ సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ కె.వి.గురువర్ధన్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ హ్యాపీ హాస్పిటల్‌లో ఆధునిక పరిజ్ఞానంతో మెరుగైన వైద్య సేవలు అందించడం జరుగుతుందని తెలిపారు. సిటీలో ఉన్న ఇతర హాస్పిటల్ కన్నా మా ఆపిల్ హాస్పిటల్లో అతి తక్కువ ధరల్లో సర్జరీలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. వార్షికోత్సవం సందర్భంగా వైద్యసేవలు, శస్త్రచికిత్సలపై ఇస్తున్న తగ్గింపు అవకాశాన్ని నగర ప్రజలతోపాటు చుట్టు ప్రక్కల వున్న వారు కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైద్యచికిత్స పొంది ఆరోగ్యాన్ని పొందిన పేషెంట్‌లు, హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
ప్రజలు గడ్డి పెట్టినా… బుద్ధి మార్చుకోని వైసీపీ నేతలు
-మనోభావాలు దెబ్బతినే విధంగా పండుగలపైనా ప్రేలాపనలు -రూ.850 కోట్లతో రోడ్లు బాగు చేసినా… వక్రబుద్ధితో విమర్శలు -రూ. 6,700 కోట్లు …