Breaking News

ఇంటింటికీ వెళ్లి జగనన్న సురక్షపై అవగాహన కల్పించండి

-కమీషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్.

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రతి వాలంటీర్ తమ క్లస్టర్ పరిధిలోని ఇంటింటికీ వెళ్లి జగనన్న సురక్ష కార్యక్రమంపై అవగాహన కల్పించి, ప్రజలకు అవసరమైన సర్టిఫికెట్స్ ఇప్పించేందుకు సహాయపడాలని కమీషనర్  స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్ అన్నారు. విజ‌య‌వాడ‌ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని 34వ డివిజన్ కేదారేశ్వర పేట, CWC గౌడాన్ 6 వ రోడ్డులో సచివాలయ సిబ్బంది జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ఏవిధంగ చేపడుతున్నారని కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ గారు, అదనపు కమిషనర్ (జనరల్) యం.శ్యామల, మరియు అదనపు కమిషనర్ (ప్రాజెక్ట్స్) కె.వి సత్యవతి, వెల్లి పరిశీలించడం జరిగింది.
ఈ సంధర్భంగా కమిషనర్ సచివాలయ సిబ్బందికి సూచనలు చేస్తూ ప్రతి ఇంటికి వెల్లి, ఆ ఇంట్లో వాళ్ళు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు అర్హులై వుండి కూడా పథకాలను పొందలేక పోతున్నారా అని క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. అలాంటి వారిని గుర్తించి పథకాలకు అవసరమైన సర్టిఫికెట్స్ వారి వద్ద లేకపోతే ధరఖాస్తు చేయించాలన్నారు. ఇంకా ఎవరికైన ప్రభుత్వం మంజూరు చేస్తున్న సర్టిఫికెట్స్ అవసరమనుకుంటె వారి చేత దరఖాస్తు చేయించి ఉచితంగా అందించాలన్నారు‌. ప్రజల దరఖాస్తులను పరిశీలించి వారికి అర్హులైన వారికి సర్టిఫికెట్స్ ను సిద్దం చేయించి, మీ ఏరియా పరిధిలో మీకు కేటాయించిన తేదిలో జరిగే క్యాంపుకు వారిని ఆహ్వానించి సర్టిఫికెట్స్ ను అందజేయాలన్నారు. ప్రతి ఇంటికి వెళ్ళి వారితో మాట్లాడిన తరువాత వారి ఫొటో ఖచ్చితంగా అప్లోడ్ చేయాలని కమీషనర్స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్ తెలియజేసారు.ఈ కార్యక్రమములో అదనపు కమిషనర్ (జనరల్)  యం.శ్యామల, అదనపు కమిషనర్ (ప్రాజెక్ట్స్)  కె.వి సత్యవతి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నారాయణ మూర్తి, సెక్రెటరీలు, వాలంటీర్లు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా డా. పసుపులేటి హరిప్రసాద్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరులో నిర్వహిస్తున్న జన్మదిన వారోత్సవాల్లో భాగంగా జరిగిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *