Breaking News

కలియుగ దైవానికి సేవ చేసుకోవడం మహద్భాగ్యం.

-వేంకన్న సేవ లో భాగస్వామ్యం పూర్వ జన్మ సుకృతం
-అన్నదాన వితరణ లో పాలుపంచుకోవడం మహాభాగ్యం
-తిరుమల అన్నదాన పథకాన్ని 10 టన్నుల కూరగాయలు పంపిణీ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కలియుగ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి అన్నదాన సేవలో భాగస్వామ్యం పూర్వ జన్మ సుకృతమని నిత్యాన్నదాన పథకానికి తమవంతు సహకారం అందించే అవకాశం కలగడం మహా భాగ్యం గా భావిస్తున్నట్లు ప్రముఖ పారిశ్రమికవేత్త నూతక్కి శ్రీరామ కృష్ణ ప్రముఖ వైద్యులు డా.తుమ్మల రాజేశ్వరరావు లు అన్నారు.తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో తిరుమల శ్రీ వేంగమాంబ సత్రం లో నిర్వహించే నిత్యాన్నదాన పథకానికి తాడేపల్లి లోని గౌతమి రివర్ భ్రీజ్ అపార్ట్మెంట్ కు చెందిన ఆదర్శ రైతు మరాడ నాగేంద్ర రావు, సత్యశ్రీ దంపతుల సహకారం తో 50 వేల రూపాయలతో 10 టన్నుల కూరగాయలను శనివారం తిరుమలకు వెళ్లే కూరగాయల వాహనానికి వేద పండితులు పూజాది కార్యక్రమాలు నిర్వహించిన అనంతరంజెండా ఊపి వాహనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కలియుగ దైవం అయిన శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకునేందుకు రాష్ట్రంనుండే కాక దేశ విదేశాల నుండి నిత్యం లక్షలాది మంది భక్తులు తరలి వస్తారన్నారు. కోరిన ప్రతి భక్తునికి అన్నప్రసాద వితరణ కల్పించడం కేవలం తిరుమల తిరుపతిదేవస్థానంలోనేసాధ్యపడుతుందన్నారు. ఈతి బాధలతో సతమతమయ్యే భక్తులు ఏడుకొండల వాడా అనాథ రక్షక గోవిందా అని పిలిచిన వెంటనే బాధల నుండి విముక్తి కల్పించే వెంకన్న స్వామి సేవలో తరించే అవకాశం కలగడం పూర్వ జన్మ సుకృతం గా ప్రతి ఒక్కరూ భావించాలని కోరారు.ఏడు కొండల వాడి కరుణా కటాక్షాలతో ప్రజలు సుఖ శాంతులతో జీవించాలని కోరుకుంటున్నామని తెలిపారు.కూరగాయల పంపిణీ కార్యక్రమంలోబి. దుర్గా ప్రసాద్, మేదరమెట్ల శ్రీనివాస్, నూతక్కి శ్రీనివాస్, రివర్ బ్రీజ్ అపార్ట్మెంట్ అసోసియేషన్ సభ్యులు ఉయ్యూరు కోటేశ్వరరావు, రామారావు రామమోహన్ రావు, మండవ శ్రీనివాస్,అడబాల సత్యనారాయణ, ఉమ్మడిశెట్టి వాసు, వెంకటేశ్వరరావు పలువురు భక్తులుపాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా డా. పసుపులేటి హరిప్రసాద్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరులో నిర్వహిస్తున్న జన్మదిన వారోత్సవాల్లో భాగంగా జరిగిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *