Breaking News

వర్షాలు పడుతుండడంతో కాలువల శుభ్రత మరియు పారిశుద్ధ్య నిర్వహణకు ప్రజలంతా బాధ్యతగా సహకరించాలి

-ఫూట్ పాత్ నిర్మాణ పనులు పరిశీలన,
-కమీషనర్స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్.

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
క్లీన్ ఆంధ్రప్రదేశ్ కార్యాచరణలో భాగంగా విజయవాడ నగరపాలక సంస్థ ప్రణాళికాబద్ధంగా నిర్వహిస్తున్న కాలువల శుభ్రత మరియు పారిశుద్ధ్య నిర్వహణకు ప్రజలంతా బాధ్యతగా సహకరించేలా పర్యవేక్షించాలని, కాలువలలో బహిరంగ ప్రదేశాలలో మరియు వీధుల్లో చెత్త వేయకుండా ప్రజలు సహకరించాలని కమీషనర్  స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్ పిలుపునిచ్చారుకాలువల శుభ్రత పనుల పర్యవేక్షణలో భాగంగా స్థానిక 34వ వార్డ్ సికే రెడ్డి రోడ్డు, మీసాల రావు బ్రిడ్జి దగ్గర పర్యవేక్షించి కాలువ ప్రక్కన ఉన్న చెక్క పెట్టెలను అక్కడి నుంచి తొలగించాలని టౌన్ ప్లానింగ్ అధికారులకు ఆదేశించారు. డివిజన్ నందు పలు ప్రాంతాల్లో జరుగుతున్న చెత్త సేకరణ ,పారిశుధ్య పనులను కమిషనర్ గారు పర్యవేక్షించారు.తదుపరి బందరు రోడ్డులో బెంజ్ సిర్కిల్ నుండి పోలీస్ కంట్రోల్ రూమ్ వరకు జరుగుతున్న కారిడార్ ఫూట్ పాత్ నిర్మాణ పనులు పరిశీలించారు. కారిడార్ ఇంప్రోమెంట్ ప్లాన్ L&T వారు చేసిన డిజైన్స్ ను యూనివర్సల్ యాక్సెస్ క్రింద నగరంలో ఉన్న అనీ ప్రధాన జంక్షన్లు అభివృద్ధి పరిచే విధంగా విజయవాడ నగరపాలక సంస్థ కృషి చేస్తుందని కమిషనర్ అన్నారుఈ పర్యటనలో అదనపు కమిషనర్ (ప్రాజెక్ట్స్) కె.వి సత్యవతి, (డిప్యూటీ సిటి ప్లానర్ ప్లానింగ్) జుబిన్ శిరన్ రాయ్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నారాయణ మూర్తి, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా డా. పసుపులేటి హరిప్రసాద్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరులో నిర్వహిస్తున్న జన్మదిన వారోత్సవాల్లో భాగంగా జరిగిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *