జవాబుదారీతనం తో కూడిన పౌర సేవలు

-జగనన్న సురక్ష కింద ఇంటింటి సర్వే చేస్తున్న వాలంటీర్లు
-ఈరోజు 801 మందికి ధ్రువ పత్రాలు అందిస్తున్నాం
-పౌర సేవలు అందించే డేటా ఎంట్రీ పక్రియను పరిశీలన
-కలెక్టర్ మాధవీలత

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జగనన్న సురక్ష కార్యక్రమంలో ఇంటింటి సర్వే ద్వారా అంద వలసి ఉన్న సేవలు గుర్తించి అర్హత కలిగిన వారికి నేడు వాటిని అందించడం జరుగుతోందని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత పేర్కొన్నారు.బుధవారం ఉదయం స్థానిక వి ఎల్ పురం 11 వ వార్డు పరిధిలో 24, 25 , 26 సచివాలయాలకు చెందిన జగనన్న సురక్షకార్యక్రమంలో కలెక్టర్ తో పాటు జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్, మునిసిపల్ కమిషనర్ కె. దినేష్ కుమార్ లు పాల్గొని ధ్రువపత్రాలు అందచేశారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, అర్హత ఉన్న ఏ ఒక్కరైన ఆ పథకం పొందకుండా ఉంటే అటువంటి వారిని గుర్తించి అందజేసేందుకు జగనన్న సురక్ష ఆలోచన ముఖ్యమంత్రి చేశారని అన్నారు. ప్రజల సమయం వృధా కాకుండా ఇంటివద్దనే పౌర సేవలు అందించే దిశలో సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 99 శాతం మంది ప్రభుత్వ పథకాలను అందుకుంటున్నారు. ఇంకా మిగిలిన ఉన్న ఒక్క శాతం అర్హత కలవారిని ఆమేరకు వాలంటీర్లను ఇళ్లకు పంపి గుర్తించడం జరిగిందన్నారు. కొందరి విషయంలో అర్హత ఉండి కరెంట్ బిల్లు ఎక్కువగా వచ్చిందని, కారు ఉందని, భూమి ఉందని తొలగించిన వారి విషయంలో అర్హత ఉంటే వాటిని సరిచేసి తిరిగి పథకాలు వర్తింప చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు. సచివాలయ వ్యవస్థ ద్వారా అధికారులు కుటుంబ సభ్యులు గా ఉండే విధంగా పరిపాలన వికేంద్రీకరణ రాష్ట్రంలో అమలు చేస్తూ, పట్టణ ప్రాంతంలో ప్రతి వంద ఇళ్లకు వాలంటీర్ సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. ఒకవేళ అర్హత లేని వారికి పథకం ఎందుకు వర్తింప చేయలేదో కూడా సవివరంగా వివరించాల్సి ఉంటుందనీ, ఇందుకు అవసరమైన వివరాలు పంపడం జరిగిందన్నారు. ప్రస్తుతం విద్యా సంవత్సరం ప్రారంభం కానున్న దృష్ట్యా అవసరమైన కుల, ఆదాయ తదితర ధ్రువ పత్రాలను ఉచితంగా అందిస్తున్నట్లు పేర్కొన్నారు. పెన్షన్, కాపు నేస్తం, జగనన్న చేదోడు, జగనన్న తోడు తదితర సంక్షేమ పథకాలకు అర్హత ఉండి పొందకుండా ఉన్న వారికి అర్హత మేరకు ద్వై వార్షిక మంజూరు ద్వారా వర్తింప చేస్తామన్నారు. కుల ధృవీకరణ పత్రాలు 394, ఆదాయ ధృవీకరణ పత్రాలు 377 ఇతర సేవలు 30 మేర అందించినట్లు కలెక్టర్ తెలిపారు.జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్ మాట్లాడుతూ, ఏదైనా సంక్షేమ పథకానికి అర్హత ఉండి అందుకోకుండా మిగిలిన వారికి ఆమేరకు కోట్లాది రూపాయల అదనపు భారం ఉన్నా కూడా జగనన్న సురక్ష ద్వారా ప్రభుత్వం అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. పట్టణ ప్రాంతాల్లో 100 కుటుంబాలకు ఒక వాలంటీర్ ద్వారా నేరుగా పౌర సేవలు ప్రభుత్వం అందిస్తోందని అన్నారు.మునిసిపల్ కమిషనర్ కె. దినేష్ కుమార్ మాట్లాడుతూ, వాలంటీర్లను ఇంటింటికీ పంపి ఎవరెవరికి ఏ ఏ సర్టిఫికెట్స్ కావాలి, ఇంకా ఏ ఏ పథకాలు అమలు కావాలో తెలుసుకోవడం జరిగిందన్నారు. 24, 25, 26 సచివాలయాల్లో 1832 ఇళ్ళ ను సందర్శించి టోకెన్లు జారీ చేయ్యాడం ద్వారా 801 సేవలు అందించినట్లు తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్ర‌జ‌లు గ‌డ్డి పెట్టినా… బుద్ధి మార్చుకోని వైసీపీ నేత‌లు

-మ‌నోభావాలు దెబ్బ‌తినే విధంగా పండుగ‌ల‌పైనా ప్రేలాప‌న‌లు -రూ.850 కోట్ల‌తో రోడ్లు బాగు చేసినా… వక్రబుద్ధితో విమర్శలు -రూ. 6,700 కోట్లు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *